CBI Focus On Child Video Porn Gang: భారత దేశ వ్యాప్తంగా ఆన్లైన్ చైల్డ్ పోర్న్ (Child Porn) విచ్చల విడిగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చైల్డ్ పోర్న్ రాకెట్ పై సీబీఐ (CBI) ఫోకస్ చేసింది. చిన్న పిల్లలతో ఫోర్నీగ్రఫీ చేయించడం.. తరువాత లైంగిక దాడులకు పాల్పడుతున్న ముఠాలపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఆన్లైన్ (Online) వేదికగా చిన్నారులను కొందరు లైంగికంగా వేధిస్తున్నట్టు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పుడు ఈ దారుణాలు ఏపీలోను వెలుగు చూస్తుండడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరాలుగా గుర్తింపు పొందిన తిరుపతి, విజయవాడ (Vijayawada)ల్లో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. వెంటనే ఈ రెండు నగరాలపై ఫోకస్ చేశారు. ఇప్పటికే రంగంలోకి దిగి సోదాలు చేపట్టిన అధికారులు.. తిరుపతి (Tirupati)లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా సీబీఐ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సుమారు 14కు పైగా రాష్ట్రాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 23 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో చైల్డ్ పోర్న్ వీడియోలను.. ఇతరులకు సర్క్యలేట్ చేస్తున్న సుమారు వందమంది అనుమానితులపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం.
కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో కూడా సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు చేసిన పలు ప్రాంతాల్లో చైల్డ్ పోర్న్ వీడియాలోను స్వాధీనం చేసుకున్నారు. వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. చైల్డ్ పోర్న్ వీడియోలను చూసిన, సర్క్యూలేట్ చేసిన అందరి పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో కేంద్రం కూడా దీనిపై హెచ్చరికలు జారీ చేసినా చైల్డ్ పోర్ట్ గ్యాంగ్ ల ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు.
ఇదీ చదవండి : చైన్ స్నాచింగ్ లో ఆరి తేరిన దొంగను పట్టించిన బైక్.. అసలు ఏం జరిగిందంటే..?
చిన్నారులను లైంగికంగా వేధిస్తూ తీసిన ఫోటోలు, వీడియోలను ఎప్పటినుంచో కొందరు అప్ లోడ్ చేస్తూనే ఉన్నారు. దీంతో 2019లో సీబీఐలోని స్పెషల్ క్రైమ్ జోన్లో ఆన్‌లైన్స్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ (OCSAE) ప్రివెన్షన్ – ఇన్వెస్టిగేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ సహా ఆన్లైన్ మాధ్యమాల ద్వారా చిన్నారులకు సంబంధించి లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వంటి సమాచారాన్ని గుర్తించి. వారిపై చర్యలు తీసుకునేందుకు ఇది ఏర్పడింది.
ఈ విభాగం ఏర్పడిన అనతి కాలంలోనే చైల్డ్ పోర్న్ రాకెట్ పై ఫోకస్ చేసిందది. 2020లో ఈ యూనిట్ సహాయంతో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ప్రభుత్వ ఇంజనీర్ రామ్‌భవన్‌ను అరెస్టు చేసింది. ఆ కామాంధుడు సుమారు 50 మంది చిన్నారులతో రూపొందించిన వీడియోలు, ఫొటోలను డార్క్‌నెట్‌లో కొందరికి విక్రయించినట్టు నిర్ధారించారు. రాష్ట్రంలోని చిత్రకూట్, బాందా, హమీర్పూర్ జిల్లాల్లోని 5-16 ఏళ్ల వయస్సు కల్గిన చిన్నారుల జీవితాలను ఛిద్రం చేస్తూ ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు సీబీఐ గుట్టు విప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, CBI, Porn ban, Porn rocket case