Betch Student Suicide: విద్యార్థులు రోజు రోజుకూ మానసికంగా బలహీనంగా అవుతున్నారా..? చిన్న చిన్నకారణాలకే ఎందుకు పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా చిత్తూరులో ఓ బీటెక్ విద్యార్థి చేసిన పని అమ్మకు గుండెకోత మిగిల్చింది.
Student Suicide: చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్తాపం చెందుతున్నారు కొందరు. తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్య (Suicide)లకు పాల్పడుతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఇదీ నేటి టీనేజర్లు, యువత తీరు. కష్టాలు ఉన్నప్పుడు మనిషి మానసిక ఒత్తిడకి గురికావడం సహజం.. కానీ నేటి యువత మాత్రం అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, టీచర్ మందలించదనో.. ఇలా అర్థం లేని.. చిన్న విషయాలకే టీనేజర్లు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. బలహీనంగా మారుతున్న టీనేజర్లు, యువత మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా (Chitoor district) తలారివారిపల్లెలో ఓ యువకుడు చిన్న కారణానికే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎగ్ దోశ తినేందుకు అమ్మ డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో బీటెక్ విద్యార్థి సూసైడ్ (Btech Student suicide) చేసుకోవడం తీవ్ర విస్మయానికి గురి చేసింది.
చిత్తూరు జిల్లా పాకాల మండలం తలారివారిపల్లెకు చెందిన 21 ఏళ్ల సాయికిరణ్ ఇంజినీరింగ్ థర్డియర్ చదువుతున్నాడు. తండ్రి మరణించడంతో తల్లే పెంచి పెద్ద చేసింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కొడుకు బాగా చదువుకోవాలని ఆశించింది. ఈ క్రమంలో సాయికిరణ్ ను ఇంజినీరింగ్ చదివిస్తోంది. అయితే ఉదయం సాయికిరణ్‌కు ఎగ్ దోశ తినాలనిపించి తల్లిని డబ్బులు అడిగాడు. ఇందుకు తల్లి ససేమిరా అంది.
ఇంట్లో అన్నం, కూర చేశా తిను.. అనవసరంగా డబ్బులు వృథా చేయొద్దని కొడుకుపై కోపగించుకుంది. తల్లి అలా చెప్పడంతో సాయికిరణ్ మనస్తాపం చెందాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సాయికిరణ్.. ఇరంగారిపల్లె దగ్గర్లోని గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. డెడ్‌బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇలా చిన్న విషయానికే చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సాయికిరణ్ తల్లి కన్నీరుమున్నీరైంది. కేవలం ఎగ్ దోస అడిగితే వద్దని మందలించినందుకు ఇంత పని చేస్తావా అంటూ ఆ తల్లి రోదించిన తీరు గ్రామస్తులను ఆవేదనకు గురి చేసింది. చిన్న విషయానికే సాయి కిరణ్ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేసింది. చిన్న విషయాలకే మనస్థాపానికి గురి కావడం, ప్రాణాలు తీసుకునేంతగా నిర్ణయాలు తీసుకోవడం.. యువతలో ఇలాంటి పోకడ మంచి పరిణామం కాదని నిపుణులు అంటున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.