Home /News /crime /

ANDHRA PRADESH CRIME NEWS BANGALORE YOUNG GIRL HOUSE ARREST IN WEST GODAVARI DISTRICT BY HER LOVER PARENTS NGS

Love: ప్రేమించిన వాడి కోసం రాష్ట్రాలు దాటి వచ్చింది.. ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

love: ప్రేమించిన వాడి కోసం రాష్ట్రాలు దాటి వచ్చింది. కానీ చివరికి మోసపోయానని గ్రహించింది. కన్నీరు మున్నీరు అయ్యిందది. కానీ పరువు పోతుందనేే భయంతో ప్రియుడి బంధువులు ఆమెను ఏం చేశారో తెలుసా..?

    ప్రేమ కోసం ఏదైనే చేస్తామంటారు యువత.. ప్రేమ లేనిది తాము లేదంటూ మైమరిచిపోతుంటారు. కానీ ఆ ప్రేమ కొందరికి శాపమవుతోంది. ప్రేమ కోసం ప్రాణాలు తీసే వారు కొందరైతే.. ప్రాణాలు తీసుకునే వారు కొందరు. మరికొందరైతే ప్రేమ పేరుతో మోసం చేసి.. దొరికినంత దోచేస్తున్నారు. మరికొన్ని సంఘటనల్లో ప్రేమ విషయం తెలియడంతో పరువు పోతుందని హత్యలు చేయడానికి కూడా తల్లిదండ్రులు వెనుకాడడం లేదు. అయినా యువత ప్రేమ మోజు నుంచి బయట పడలేకపోతున్నారు. తాజాగా ఓ యువతి తన ప్రేమ కోసం రాష్ట్రాలు దాటి వచ్చింది. చివరికి ప్రేమికుడ్ని కలిసే ప్రయత్నం చేసింది.. అసలు విషయం తెలిసి షాక్ కు గురైంది. దీంతో అతడ్ని నిలదీసే ప్రయత్నం చేసినా కుదరలేదు. ప్రేమికుడ్ని కలవాలి అనుకున్న ఆమె రెండు రోజుల పాటు మాయమైంది.. చివరికి పోలీసల జోక్యంతో బయటపడి.. ప్రియుడి కుటుంబంపై ఫిర్యాదు చేసింది..

    ప్రేమించిన వ్యక్తి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన యువతికి పశ్చిమగోదావరి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. ప్రియుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు తనను నిర్బంధించి బెదిరింపులకు గురిచేస్తారని ఊహించని ఆ యువతి రెండు రోజుల పాటు తీవ్ర మనోవ్యధకు గురైంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన ఎ.రమేష్ అనే యువకుడు బెంగళూరుకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ యువతికి మాయమాటలు చెప్పి రెండేళ్ల కిందట స్వగ్రామానికి వచ్చిన రమేష్‌ దగ్గరి బంధువుల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి రమేష్‌ను దూరం పెట్టగా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారంటూ మాయమాటలు చెప్పి ఆమెకు మళ్లీ దగ్గరయ్యాడు.

    ఇదీ చదవండి: ఫోన్ నెంబర్ కోసం రచ్చ రచ్చ.. చివరికి నెంబర్ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం!

    తనకు ఇంట్లో సమస్యలు ఉన్నాయని.. అన్నింటిని బయటపడి త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటూ మాయమాటలు చెప్పిన రమేష్ పలు దఫాలుగా ఆమె దగ్గర 50 లక్షల నగదు, బంగారం తీసుకున్నాడు. కరోనా నేపథ్యంలో ఏడాది కిందట స్వగ్రామానికి వచ్చిన రమేష్‌ అప్పటి నుంచి తనతో ఫోన్లోనే మాట్లాడేవాడని.. కొద్ది రోజులుగా ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేయడంతో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు ఈనెల 3న నవుడూరులోని రమేష్‌ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. రమేష్‌ కుటుంబ సభ్యులు ఆమెను దుర్భాషలాడి బెదిరించడంతో దిక్కుతోచని స్థితిలో నవుడూరు బస్టాండ్‌ వద్ద కూర్చొని విలపిస్తుండగా స్థానికులు గమనించారు. ఈ విషయం బయటకు వస్తే తమ పరువు పోతుందని భావించిన రమేష్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెకు మాయమాటలు చెప్పి పెనుమంట్ర మండలం పొలమూరు శివారులో ఒక ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించినట్టు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    ఇదీ చదవండి: హరిబాబుకు గవర్నర్ పదవి ఇవ్వడానికి కారణం ఇదే..? సీఎం జగన్ స్వాగతిస్తారా..?

    యువతిని నిర్బంధించిన విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు ఈ సమాచారం పోలీసులకు చెప్పారు. వెంటనే ఎస్సై ఎ.పైడిబాబు రంగంలోకి దిగారు. పొలమూరులోని ఆ ఇంటికి వెళ్లి బాధిత యువతిని విడిపించి వీరవాసరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్‌, అతడికి సహకరించిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Bangalore, Crime news, Lover, West Godavari

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు