Firing: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chitoor District) లో కాల్పులు కలకలం రేపాయి. రామచంద్రాపురం మండలం కుప్పం బాదూరు (Kuppam Badur) హై స్కూల్ (High School) లో ఎయిర్ గన్ (Air Gun) తో కాల్పులు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల ఘటనపై మండలంలో ప్రజలు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రామచంద్రపురం మండలం, కుప్పం బాదూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎయిర్ గన్ తో కాల్పులకు పాల్పడినట్టు గుర్తించారు. కుప్పంబాదురు స్కూల్ లో ఎయిర్ గన్ (Air Gun) తో తలుపులకి ప్రధానోపాధ్యాయుని రూంలో గోడకి వెనుకవైపు, డ్రైనేజి పైపులను ఫైర్ చెయడంతో.. అవి పగిలి రంద్రాలు పడ్డాయి.
అయితే ఆదివారం సెలవు కావడంతో సోమవారం వచ్చిన హెడ్ మాస్టర్ అక్కడ రంధ్రాలను గుర్తించి భయపడ్డాడు.. వెంటనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై గిరిబాబు తన సిబ్బందితో హై స్కూల్ (High School) కి వెళ్లి కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
ఈ సంఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాఠశాలకు రెండ్రోజులు సెలవు కావడంతో ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ప్రహరీ దాటి లోపలకు ప్రవేశించినట్టు గుర్తించాం అన్నారు. హెచ్ఎం గది తాళాలు పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఆ తర్వాత ఉన్మాదుల్లా డ్రైనేజీ పైపులు, గోడలు, తలుపులపై ఎక్కడపడితే అక్కడ నాటు తుపాకీతో కాల్చేసి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు..
ఇదీ చదవండి : మళ్లీ భయపెడుతున్న గోదావరి.. భారీ వానలతో పెరుగుతున్న వరద.. ప్రమాదకరంగా ప్రవాహం
సోమవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు పరిస్థితిని చూశాక పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఎస్ఐ గిరిబాబు వెంటనే పాఠశాలకొచ్చి పరిసరాలను పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. విద్యార్థులను భయబ్రాంతులను చేయడానికి డమ్మీ తుపాకీని వాడినట్లు కొందరు చెబుతుండగా.. మరికొందరేమో డమ్మీ తుపాకీతో ఇనుప వస్తువులు సొట్టలు పడవని అంటున్నారు. వాస్తవాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అదేసమయంలో కుప్పంబాదూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బడిలో చొరబడ్డారన్న ప్రచారమూ జరుగుతోంది.
ఇదీ చదవండి : టీడీపీ ముందు బీజేపీ పెట్టిన డిమాండ్ ఇదేనా..? మరి చంద్రబాబు ఒకే అన్నారా..? ఏపీలో పొత్తు ఫిక్స్ అయ్యేనా..?
అయితే ఆ ఇద్దరూ అపరిచితులు ఎవరు..? గ్రామంలోకి ఎలా వచ్చారు.. మరేదైనా ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఆ ఇద్దరు ఎవరు అన్నది ఇప్పటి వరకు బయట పడలేదు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరి దగ్గర నిజమైన తుపాకీలు ఉంటే ఏంటి పరిస్థితి అని.. వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chitoor, Crime news