ANDHRA PRADESH CRIME NEWS 4 PEOPLE DIED IN CAR ACCIDENT WHO GO TO ATTEND A MARRIAGE IN ANANTAPURAM NGS
Road Accident: పెళ్లికి వెళ్తుంటే ప్రాణాలు తీసిన టైరు.. స్పాట్లోనే నలుగురు మృతి..
పెళ్లింట విషాదం నింపిన కారు
Road Accident: సందడిగా పెళ్లికి వెళ్తున్నారు.. కాసేపట్లో పెళ్లి మండపానికి చేరుకుంటారు.. ఇలా సరదాగా సాగుతున్న వారి ప్రయాణంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.. టైరు పేలడంతో నలుగురు మృతి చెందారు..
Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఎంతో సందడిగా ఉండాల్సిన ఆ కుటుంబం ఇప్పుడు శోక సముద్రంలో మునిగింది. పెళ్లి పేరుతో సొంత ఊరుకు వస్తుండడంతో అందరూ చాలా ఆనందంగా కనిపించారు.. చిత్తూరు(chitoor) నుంచి అనంతపురం చేరుకోవాలి అనుకున్నారు.. మరి కాసేపట్లో కళ్యాణ మండపానికి చేరుకుంటామని.. పెళ్లిలో సందడి చేయాలని అంతా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటున్నారు.. ఇలా సరదగా సాగుతున్న వారి ప్రయాణంలో ఊహించని కుదుపు చోటు చేసుకుంది. వారు ప్రయాణించే కారుకే ఉన్న టైరు మృత్యువులా మారింది. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో ఏం జరిగుతోందా అర్థమయ్యే లోపే... కారు పేలిన సమయంలో ఎదురుగా పెద్ద లారీ వస్తుండడంతో.. అదుపుతప్పి నేరుగా లారీని ఢీ కొంది. దీంతో ఏం జరుగుతోందో ఊహించే లోపే నలుగురు స్పాట్ లోనే మరణించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి (Madanaplli)కి చెందిన ఓ కుటుంబం కారులో వివాహ కార్యక్రమానికి అనంతపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు ముందు టైరు పేలడంతో అదుపుతప్పి అనంతపురం (anantapuram) నుంచి చెన్నై వెళ్తున్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 50 ఏళ్ల అమ్మాజి, కుమారుడు 25 ఏళ్ల రెడ్డి భాషా, 30 ఏళ్ల కుమార్తె రేష్మ, 36 ఏళ్ల అల్లుడు బాబు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. బాబు, రేష్మల కుమార్తె 5 జస్మితకు తీవ్ర గాయాలయ్యాయి. బాలికను చికిత్స కోసం నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
కారులో చిన్న పిల్లలు కూడా ఉండడంతో ఆ హాకారాలు మిన్నంటాయి.. చుట్టుపక్కల స్థానికులు అక్కడకు చేరుకుని కారులో ఉన్నవారిని బయటకు తీసే ప్రయత్నం చేసినా.. కష్టంగా మారింది. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో కారులో చిక్కుకున్న మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు. బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కు టుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.
ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ఇరుక్కున్న మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద బయటకు తీయాల్సి వచ్చింది. వీరి స్వగ్రామం అనంతపురం జిల్లా తనకల్లు మండలం కడపలవారిపల్లి. 15 ఏళ్ల క్రితం మదనపల్లికి పనుల కోసం వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. తరచూ స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేవారు. ప్రమాదస్థలాన్ని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీఐ మన్సూరుద్దీన్ పరిశీలించారు. మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి రలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.