Home /News /crime /

ANDHRA PRADESH CRIME GUNTURU B TECH STUDENT MURDER CASE UPDATE POLICE SUSPECTED ONE YONG MAN NGS GNT

B Tech Student Murder: బీటెక్ విద్యార్థిని హత్యకు ముందు ఆ 8 నిమిషాలు ఏం జరిగింది? హంతకుడు అతడేనా..?

బీటెక్ విద్యార్థిని హత్య కేసు

బీటెక్ విద్యార్థిని హత్య కేసు

బీటెక్ విద్యార్థిని హత్య కేసు మిస్టరీ వీడుతోందా? హత్య చేసే ముందు దుండగుడు 8 నిమిషాలు ఆమెతో మాట్లాడాడా? హత్యకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారా?

  అన్నా రఘు అమరావతి ప్రతినిది న్యూస్,                           ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన బీటెక్ విద్యార్థిని హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడు ఎవరు అన్నది గుర్తించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరం కాకాణి రోడ్డులో ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న రమ్య.. ఒంటరిగా నడుచుకుని వెళ్తోంది. అదే సమయంలో రోడ్డు పక్కనుంచి వచ్చిన ఓ యువకుడు రమ్య ను బైక్ ఎక్కాలి అంటూ కోరాడు. వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆమె తిరస్కరించడంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆరు సార్లు రమ్యపై కిరాతకంగా దాడి చేసి పరారయ్యాడు. దగ్గర్లోనే ఉన్న స్థానికులంతా గుమిగూడి అపస్మారక స్థితిలో ఉన్న రమ్యను ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె ఆస్పత్రికి వెళ్లే సరికే మరణించింది. దీంతో ఈ హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అన్నదానిపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే ఆమె మొబైల్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అన్ లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఫోన్ అన్ లాక్ అయితే పూర్తి విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. అయితే స్థానికులు చెప్పిన వివారాల ప్రకారం. ఆ హత్య చేసిన దుండగుడని.. బైక్ ఎక్కను అన్నందుకే హత్య చేశాడని భావించారు. కానీ పోలీసులు మాత్రం తెలిసిన వాడే ఈ హత్యకు పాల్పడ్డాడని ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం. రమ్య తల్లిదండ్రులు, స్నేహితులను ప్రశ్నించి కీలక సమాచారం సేకరించారు. దానికి తోడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా నిందితుడ్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

  ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే హోమంత్రి సుచరిత ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని.. నిందుతుడికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారన్నారు. ఈదారుణానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించేలా చేస్తాను అన్నారు. హత్యకు ముందు యువతితో ఘర్షణకు దిగాడాని.. ఆమెకు నిందితుడు తెలిసిన వ్యక్తే అయినా మహిళలను చంపే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఉన్మాదుల్లా హత్య చేయడం అత్యంత దారుణమన్నారు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. ఉన్మాదంతో దారుణాలకు తెగబడుతున్న ఇలాంటి వాళ్ళను ఏ విధంగా శిక్షించాలో అర్థం కాలేదన్నారు. వీరికి ఉరే సరైన శిక్షలా అనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.

  మరోవైపు ఈ హత్య చేసింది శశి కృష్ణ అనే యువకుడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేయడానికి ముందు ఎనిమిది నిమిషాలు రమ్యతో నిందితుడు మాట్లాడినట్టు గుర్తించారు. ఏదో ఒక విషయంలో నిందితుడితో రమ్య వాగ్వివాదానికి దిగిందని.. వాగ్వాదం జరుగుతున్న కొద్ది సేపటి తర్వాతే యువకుడు హత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి అన్నారు. రమ్య స్నేహితురాలి ద్వారా పూర్తి వివరాలు సేకరించామంటున్నారు పోలీసులు..

  మరోవైపు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దిశ చట్టం అంటూ జగన్ రెడ్డి బిగ్గరగా అరవడం.. వైసీసీ బ్యాండ్ బ్యాచ్ ఈలలు, కేకలు వెయ్యడం తప్ప ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరిగింది లేదన్నారు. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం.. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇంకేమి రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. సీఎం ఇంటి పక్కన, సొంత నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే ఈ రోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోవడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనమంటూ లోకేస్ మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగన్ రెడ్డి గారు దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఉపన్యాసం ఇస్తున్న సమయంలోనే గుంటూరులో దళిత యువతి రమ్యని అత్యంత కిరాతకంగా ఓ మృగాడు హత్య చేయడం దారుణమన్నారు. ఉన్నత విద్యనభ్యసిస్తూ బంగారు భవిష్యత్తు ఉన్న రమ్య ప్రయాణం అర్దాంతరంగా ముగిసిపోవడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రమ్యని హత్య చేసిన మృగాడికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP home minister sucharitha, AP News, Crime news, Gunturu, Mekathoti sucharitha, Nara Lokesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు