ANDHRA PRADESH CM YS JAGANMOHANREDDY ANNOUNCED RS 10 LAKHS TO ANUSHA FAMILY IN NARASAROPET HERE ARE THE DETAILS PRN
Andhra Pradesh: ‘వాడిని వదలొద్దు...’ అనూష హత్యపై స్పందించిన సీఎం జగన్… కుటుంబానికి రూ.10లక్షల సాయం
సీఎం వైఎస్ జగన్ (ఫైల్ పోటో)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గుంటూరు జిల్లా (Guntur District) నరసరావుపేటలో (Narasaraopet) డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohanreddy) స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సీఎంఓ అధికారులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటన తీవ్రంగా కలచివేసిందని సీఎం జగన్ అన్నారు. కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనూషను హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని... నేరాన్ని నిరూపించి కఠిన శిక్షణ పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన అనూష కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన జగన్.. వీలైనంత త్వరగా సాయం అందించి కుటుంబానికి భరోసా కల్పించాలన్నారు. ఈ మేరకు సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
మరోవైపు అనూష హత్యపై నరసరావుపేటలో విద్యార్థి సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగాయి. మృతదేహంతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, బంధువులు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. దీంతో నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు నచ్చజెప్పినా ఆందోళనకారులు శాంతించలేదు.
అనూష, విష్ణువర్ధన్ రెడ్డి (ఫైల్ ఫొటోలు)
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోట అనూష నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీకి చెందిన తోటి విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొంతకాలంగా అసలు ప్రవర్తన బయటపడటంతో అతడ్ని దూరం పెట్టింది. ఈ క్రమంలో అనూషపై విష్ణువర్ధన్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని భావించి ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం అనూషను బైక్ పై తీసుకెళ్లిన విష్ణువర్ధన్ రెడ్డి.. ఆమెను గొంతునులిమి హత్య చేసి మృతదేహాన్ని సాగర్ మేజర్ కాలువలో పడేశాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఐడీకార్డును గుర్తించి ఆ కాలేజీలో ఆరా తీశారు. ఆమె ఎవరన్నది గుర్తించి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఐతే తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్నవాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. అనూష కుటుంబ సభ్యులకు మద్దతుగా టీడీపీ, సీపీఐ నేతలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో ఘటనపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. అనూష కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధికసాయం ప్రకటించారు.