• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • ANDHRA PRADESH CM YS JAGAN CLOSE RELATIVE ARRESTED IN KADAPA BLASTING CASE NGS TPT

Andhra Pradesh: సీఎం జగన్ సమీప బంధువు.. ఎంపీ అవినాష్ రెడ్డి పెదనాన్న అరెస్ట్.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఇదే

Andhra Pradesh: సీఎం జగన్ సమీప బంధువు.. ఎంపీ అవినాష్ రెడ్డి పెదనాన్న అరెస్ట్.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఇదే

సీఎం జగన్ సమీప బంధువు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెండి సమీప బంధువు అరెస్ట్ అయ్యారు. అది కూడా సీఎం సొంత ఇలాకాలో.. దీంతో ఇప్పుడు ఈ ప్రతాప్ రెడ్డి ఎవరు. ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?.. ఎందుకు అరెస్ట్ అయ్యారు అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు సైతం ఆయన గురించి తెలుసుకనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

  • Share this:
    సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన వ్యక్తి అరెస్టు కావడం కడపలో సంచలనంగా మారింది. కడప జిల్లా మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల్లో పది మంది కూలీల బతుకులను ఛిద్రం చేసిన మైనింగ్‌ పేలుడు కేసు దార్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎక్స్‌ప్లోజివ్‌ లైసెన్సు దారుడు వైఎస్‌ ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈయన సీఎం జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సమీప బంధువు, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి స్వయానా పెదనాన్న. వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరుతో 2001 నవంబరులో మామిళ్లపల్లిలో మైనింగ్‌ లీజు జారీ కాగా.. నిర్వహణ హక్కులను బి.మఠం మండలానికి చెందిన వైసీపీ నేత నాగేశ్వర్‌రెడ్డికి 2013లో జీపీఏ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనే మైనింగ్‌ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడిచి భూగర్భ బెరైటీస్‌ మైనింగ్‌ను కొనసాగిస్తున్నారు.

    గనిలో వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌ పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దింతో పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌రెడ్డికి చెందిన మ్యాగజైన్‌ లైసెన్స్‌ నుంచి జిలెటన్‌ స్టిక్స్‌ తరలించినట్లు వెల్లడవడంతో పాటు.. అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలైనా సరే.. ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టకుండా తరలించారంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. వైఎస్ ప్రతాప్ రెడ్డికి పులివెందుల, సింహాద్రిపురం, లింగాల పరిసర ప్రాంతాల్లో గనులున్నాయి. ఈ నేపథ్యంలో పేలుడుకు వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌కు మ్యాగజైన్‌ లైసెన్స్‌ ప్రతాప్‌రెడ్డికి ఉంది. ఈ క్రమంలో పులివెందుల నుంచి మామిళ్లపల్లె గనులకు జిలెటన్‌ స్టిక్స్‌ తరలించి అక్కడ అన్‌లోడ్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది.

    ఈ భారీ పేలుడు కారణంగా 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురాళ్ల క్వారీ వద్ద ఈనెల 8వ తేదీన జరిగిన పేలుడుకు సంబంధించి బాధ్యులైన లీజుదారుడు నాగేశ్వరరెడ్డి, ఎక్స్‌ప్లోజివ్‌ మేనేజర్‌ రఘునాథరెడ్డిలను ఇప్పటికే అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. క్వారీ పేలుడు ఘటనలో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా కడప ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌ను నియమించామన్నారు. మరణించిన వారిలో మేనేజర్‌ లక్ష్మిరెడ్డి కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన కీలక వ్యక్తి అయిన ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

    ఈయన పులివెందులకు చెందిన యర్రగుడి రఘునాథరెడ్డికి పేలుడు పదార్థాలు, రెండు మ్యాగజైన్లలో భద్రపరుచుకోవడానికే అగ్రిమెంటు ఇచ్చారు. ప్రతాప్ రెడ్డికి చెందిన లైసెన్సు మ్యాగజైన్లలో పేలుడు పదార్థాలు, జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను అధిక లాభానికి లైసెన్సు లేని వారికి రఘునాథరెడ్డి అక్రమంగా విక్రయిస్తూ వస్తున్నారు. 8న ఎక్స్‌ప్లోజివ్‌ రూల్స్‌కు విరుద్ధంగా లైసెన్సు లేని లక్ష్మిరెడ్డికి జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను రఘునాథరెడ్డి అక్రమంగా విక్రయించారు. వాటిని కలసపాడు మండలం, పోరుమామిళ్ల సమీపంలోని కొండగంగమ్మ మైనింగ్‌కు ఎలాంటి భద్రత లేని కారులో తీసుకొని వెళ్లి దించుతుండగా ఈ పేలుళ్లు జరిగాయి అని వివరించారు. సీఎం సమీప బంధువు అరెస్ట్ అవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అలాగే వైఎస్ వివేక హత్య కేసు నిందితులను కూడా అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి..
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు