ANDHRA PRADESH CIRME NEWS ONE WIFE KILLED HER HUSBAND IN TIRUPATI NGS TPT
Andhra Pradesh: భర్త వేధింపులతో విసుగు చెందిన భార్య.. చివరికి ఎవరూ ఊహించని పనితో షాక్
ప్రతీకాత్మక చిత్రం
అమ్మనాన్నలతో ఆటలాడుకోవాల్సిన చిన్నారులు ఇప్పుడు అనాథలయ్యారు. భార్త వేధింపులు తాళలేక ఓ భార్య.. మర్మాంగంపై పొడిచింది. స్పాట్ లోనే భార్త చనిపోగా.. హత్యా నేరం కింద భార్య జైలుకెళ్లాల్సి వచ్చింది.
అన్యోన్యంగా ఉండాల్సిన భార్యభర్తల జీవితంలోకి వచ్చిన అనుమానమే పెను భూతమైంది. భార్య ఉద్యోగం చేస్తున్న బ్యూటీ పార్లర్ నుంచి ఆలస్యంగా వస్తోందని మొదలైన అనుమానం.. రాను రాను పెరుగుతూ భూతంగా మారింది. దీంతో భార్యకు రోజూ వేధింపులు మొదలయ్యాయి. ఆ అరాచకాలు హద్దులు దాటడంతో రోజూ నరక యాతన అనుభవించింది భార్య. ఇక భర్తతో బతకాల్సిన అసవరం లేదని నిర్ధారణకు వచ్చిన భార్య ఎవరూ ఊహించని పని చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
రెండు మూడేళ్ల కిందటి వరకు ఆనందంగా సాగుతున్న జీవితం ఆ దంపతులది. పెద్దలు కుదిర్చిన వివాహం.. అయిన వారి అన్యోన్యతను చూసి ఇరుగు పొరుగు వారు ఈర్ష పడేవారు. హ్యాపీగా సాగుతున్న వీరి దాంపత్య జీవితానికి నిదర్శనంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతా సాఫీగా సాగుతున్న వారి సంసారంలో అనుమానం పెనుభుతంగా మారింది. భార్యపై అనుమానం తారాస్థాయికి చేరుతూ వచ్చింది. ఇద్దరిమధ్య తరచు వాదోపవాదాలు జరిగి గొడవలకు దిగే వారు. వృత్తి రీత్య భార్య తులసి బ్యుటిసియన్ కావడంతో మరింత అనుమానంతో తరచు బార్యపై చేయిచేసుకునే వాడు.... కిరణ్ కుమార్ .
మాటలతోనే చిత్రహింసలు పెడుతూ..... తులసి బ్యూటీ పార్లర్ నుంచి లేటుగా రావడం ద్వారా రాత్రంతా నిద్ర లేకుండా చేసి....ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావని ప్రశ్నించ సాగాడు. భర్త మరో మారు గొడవకు దిగటంతో తులసి సహనం కల్పోయింది. భర్త ఉన్న లేకున్నా ఒక్కటే అనే అభిప్రాయానికి వచ్చిన ఆ వివాహిత భర్తను చంపేందుకు సిద్దం అయింది. ఇంతలోనే భర్త తనపై చేయిచేసుకోవడంతో చేతిలో కత్తి ఎత్తుకొని పొడిచేస్తానంటూ బెదిరించింది. అయిన అతను తనను చితకబాదడంతో కత్తి ఏత్తుకొని ఏ భార్య చేయని పని తులసి చేసింది
కడప అక్కాయపల్లెలోని చెందిన 35 ఏళ్ల వల్లూరు కిరణ్‌కుమార్ కు కలసపాడు మండలం ముద్దిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తులసితో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు జీవనఆచారి(10), సుశాంత(8) ఉన్నారు. కిరణ్ కుమార్ కార్పెంటర్ గా పనిచేసేవాడు. కొన్ని నెలల క్రితం ఇతడి భార్య తులసి సమీప ప్రాంతంలోని బ్యూటీపార్లర్‌లో పనిచేసేది. ఆమె ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో భార్యపై అనుమాన పడుతుండేవాడు. ఈ నేపధ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వీరు నాలుగు నెలల నుంచి లోహియానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
ఇళ్లు మారినా అతడిలో అనుమానం వదలకపోవడంతో వీరి మధ్య గొడవలు వస్తుండేవి. గురువారం రాత్రి కూడా భార్యభర్తలు గొడవ పడడంతో ఆమె కత్తి తీసుకుని భర్త మర్మస్థానాల్లో పొడిచింది. దీంతో కిరణ్‌కుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం బంధువుల ఫిర్యాదు మేరకు కడప డీఎస్పీ సునీల్, తాలుకా ఎస్ఐ హుసేన సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుని భార్యపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. కాగా హత్యకు పాల్పడ్డ తులసిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.