ANDHRA PRADESH BTECH STUDENT ENDS LIFE AFTER LOSING MONEY IN CRICKET BETTING IN CHITTOOR DISTRICT SU BK
Betting: ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్.. కుప్పంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. చనిపోయేముందు ఇన్‌స్టాలో పోస్ట్..
బీటెక్ విద్యార్థి ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్..
ఇటీవలి కాలంలో చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చాలా మంది బెట్టింగ్ మోజులో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఇటీవలి కాలంలో చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చాలా మంది బెట్టింగ్ మోజులో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలా తీవ్ర నష్టాలు చవిచూసినవారిలో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లితండ్రుల ఆశలు...ఆశయాలను తుంచివేస్తూ వారికి తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో క్రికెట్ బెట్టింగ్‌కు బానిసగా మారిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. జిల్లాలోని శాంతిపురం మండలం రాళ్లబూదుగురు గ్రామానికి చెందిన కిరణ్ కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చుట్టూ ఉన్న విద్యార్థుల్లో కొందరు బెట్టింగ్ కడుతూ సులభమైన మార్గంలో డబ్బు సంపాదించడం గమనించాడు. తాను బెట్టింగ్ చేస్తే అధికంగా డబ్బులు వస్తాయని భావించి జూదానికి అలవాటు పడ్డాడు.
తొలుత బాగానే అనిపించడంతో అందులో డబ్బులు ఎక్కువగా పెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే వందలు వేలుగా మారాయి. అయితే తొలుత వచ్చిందని ఆనందపడ్డ కిరణ్.. తర్వాత నష్టాలను చవిచూశాడు. పూర్తిగా అప్పులో కూరకుపోయాడు. ఈ విషయం తెలిసేసరికి జరగాల్సింది జరిగిపోయింది. ఇక, చివరకు కిరణ్ తీవ్ర మానసకి వేదనకు లోనయ్యాడు. కొద్ది రోజులుగా స్నేహితులతో కూడా సరిగా మాట్లాడం లేదు. మరోవైపు బెట్టింగ్ చేసిన అప్పుల వేధింపులు తట్టుకోలేకపోయాడు.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో తనలాగా ఎవరూ బెట్టింగ్ చేయకండి అంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. బెట్టింగ్ వల్ల జీవితాలను చిదిమేసుకోకండి అని కోరాడు. ఈ పోస్ట్ చేసిన 8 గంటల తర్వాత కుప్పం మండలం బంగారునత్తం రోడ్డులోని మామిడి తోటలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.