AP Speaker: మహిళలపై అత్యాచారాలపై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.. ఆలోచన ధోరణి మారాలన్న తమ్మినేని

స్పీకర్ తమ్మినేని సీతారాం

చట్టం పరిధి దాటి వెళ్లినా పర్వాలేదు అంటూ స్పీకర్ తమ్మినేని సీతారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే మనసుకు చాలా బాధగా ఉందని.. అలాంటి వారి విషమంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరైందే అన్నారు స్పీకర్..

  • Share this:
    ఏపీ స్పీకర్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేరము-శిక్ష. ఈ కాన్సెప్ట్‌పై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేసేవారిని భూమిపై లేకుండా చేయాలన్నారు. పురుషుల ఆలోచనా ధోరణి మారాలని ఆయన పిలుపు ఇచ్చారు. రోజు రోజుకూ మన సొసైటీలో నైతికత లేకుండా పోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు పెరగడం కలచివేస్తోంది అన్నారు. కఠిన చట్టాలు అమలవుతున్నా కొంతమందిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి పరిస్థితిలో మార్పు రావాలి అంటే మరింత కఠినంగా వ్యవహరించాలని.. అప్పుడైనా మార్పు వస్తుందేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే చట్టాలను పక్కనపెట్టి నిందితులను వేటాడాలన్నారు. ఇలాంటి విషయాల్లో  చట్టం పరిమితులు దాటి వెళ్లినా పరవాలేదన్నారు. దిశ యాప్‌కు సంబంధించిన అవగాహన కార్యక్రమంలో తమ్మినేని ఈ కామెంట్స్ చేశారు.

    ఇటీవల దిశపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి హతమార్చిన దోషులను వేటాడారంటూ సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను అభినందించారు స్పీకర్ తమ్మినేని. మగాడు అనే వ్యక్తి సమాజానికి ప్రొటక్షన్ ఇవ్వాలి కానీ మృగంలా మారకూడదన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై ఔటాఫ్ లా వెళ్లైనా సరే శిక్షించాలన్నారు. కన్నతండ్రులు పసిపిల్లలను అమానుషంగా చెరబడుతున్నారంటూ ఎమోషనల్ అయ్యారు తమ్మినేని. రాముడు తిరిగిన పుణ్యభూమిలో, కృష్ణుడు నడయాడిన ధర్మభూమిలో.. ఈ దారుణాలు ఏంటంటూ ప్రశ్నించారు. సమాజంలో మానసికమైన మార్పు రావాలని ఆకాంక్షించారు స్పీకర్ తమ్మినేని సీతారం.

    ఏపీ వ్యాప్తంగా దిశ యాప్‌ను విసృతంగా ప్రమోట్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అందుకే ఏకంగా సీఎం జగన్ కూడా ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ దిశ యాప్ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. యాప్‌ను స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళా ఇన్‌స్టాల్ చేసేలా చూసే బాధ్యతలను ప్రజా ప్రతినిధులకు అప్పగించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అంతా దిశా యాప్ పై ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: