PUBG: పబ్‌జీ ఆడనివ్వడం లేదని పురుగుల మందు తాగిన విద్యార్థి...ఆసుపత్రిలో మృతి...

PUBG: లోహిత్ విరామం లేకుండా స్మార్ట్ ఫోన్‌లో పబ్‌జీ గేమ్‌ ఆడుతుండటంతో తల్లి త్రివేణి అతడిని మందలించింది. అంతేకాదు అతడి ఫోన్‌ను లాక్కుంది. దీంతో కలత చెందిన లోహిత్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

news18-telugu
Updated: September 11, 2019, 11:11 PM IST
PUBG: పబ్‌జీ ఆడనివ్వడం లేదని పురుగుల మందు తాగిన విద్యార్థి...ఆసుపత్రిలో మృతి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 11, 2019, 11:11 PM IST
PUBG: పబ్ జీ గేమ్ మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇప్పటికే కర్ణాటకలో పబ్ జీ గేమ్ ఆడనివ్వడం లేదని కన్నతండ్రి పీక కోసిన ఘటన మరువక ముందే, మరో విద్యార్థి పబ్‌జీ గేమ్‌ ఆడనివ్వడం లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే విశాఖ గాజువాక చినకొరాడ ప్రాంతానికి చెందిన వెంకటరమణ, త్రివేణి దంపతుల కుమారుడు లోహిత్‌ 10వ తరగతి చదువుతున్నాడు. అయితే గత కొంత కాలంగా లోహిత్ విరామం లేకుండా స్మార్ట్ ఫోన్‌లో పబ్‌జీ గేమ్‌ ఆడుతుండటంతో తల్లి త్రివేణి అతడిని మందలించింది. అంతేకాదు అతడి ఫోన్‌ను లాక్కుంది. దీంతో కలత చెందిన లోహిత్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తమ కుమారుడు సూసైడ్ చేసుకున్నాడని గమనించిన లోహిత్ తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

అయితే చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి లోహిత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...