అక్రమ మద్యంతో పట్టుబడ్డ ఇద్దరు ఏపీ పోలీసులు..

తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం జోరుగా రవాణా అవుతోంది. తాజాగా, ఇద్దరు పోలీసులు అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డారు.

news18-telugu
Updated: May 25, 2020, 9:48 AM IST
అక్రమ మద్యంతో పట్టుబడ్డ ఇద్దరు ఏపీ పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం జోరుగా రవాణా అవుతోంది. తాజాగా, ఇద్దరు పోలీసులు అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు కానిస్టేబుల్స్ మద్యంతో కనిపించారు. వారిని విచారించగా.. తెలంగాణ నుండి ఆంధ్రాకు తరలిస్తున్నట్లు తేలింది. వారి నుంచి 400 క్వార్టర్ బాటిళ్లు, 20 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఇద్దరిలో విజయవాడలోని GRPలో డిప్యూటేషన్‌లో పనిచేస్తున్న శివరామకృష్ణ, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు అని పోలీసులు తెలిపారు. ఏపీలో మద్యం ధరలు పెరగడంతో పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు వెల్లడించారు.
First published: May 25, 2020, 9:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading