• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • ANANYA KUMARI ALEX POPULARLY KNOWN AS THE FIRST TRANSGENDER RADIO JOCKEY IN KERALA HAS COMMITTED SUICIDE VB GH

Transwoman: కేరళకు చెందిన ప్రముఖ ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య.. కారణం అదేనా..!

అనన్య (ఫైల్)

Transwoman: కేరళలో తొలి ట్రాన్స్‌జెండర్ రేడియో జాకీగా పాపులర్ అయిన 28 ఏళ్ల అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్య చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో దిగి అందరి దృష్టిని ఆకర్షించిన అనన్య.. లింగమార్పిడి చికిత్స వల్ల కలుగుతున్న నొప్పి భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    కేరళలో తొలి ట్రాన్స్‌జెండర్ రేడియో జాకీగా పాపులర్ అయిన 28 ఏళ్ల అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్య చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో దిగి అందరి దృష్టిని ఆకర్షించిన అనన్య.. లింగమార్పిడి చికిత్స వల్ల కలుగుతున్న నొప్పి భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది జూన్ నెలలో కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనన్య కుమారి లింగ మార్పిడి ఆపరేషన్ (సెక్స్ రీసైన్మెంట్ సర్జరీ) చేయించుకుంది. అయితే సర్జరీ తరువాత విపరీతమైన నొప్పితో బాధ పడింది. కొన్ని నెలల తర్వాత తనకు ఆపరేషన్ చేసిన ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లను నిలదీసింది. సరిగా ఆపరేషన్ చేయని కారణంగా భరించలేని నొప్పి వస్తుందని.. రోజు వారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నానని వైద్యులను నిందించింది. ఆ తరువాత దుష్ప్రభావాలు ఎక్కువ అయ్యాయని ఆమె తెలిపింది. ఆ నొప్పి భరించడం కంటే చనిపోవడమే మేలనుకున్న ఆమె తాజాగా ఆత్మహత్య చేసుకుంది.

    అనన్య కుమారి గత కొద్ది నెలలుగా కొచ్చిలోని ఎడప్పల్లి సమీపంలో ఒక అపార్ట్మెంట్‌లో ఉంటుంది. మంగళవారం సాయంత్రం ఆమె ఫ్యాన్ కి ఉరేసుకుని విగతజీవిగా కనిపించిందని పోలీసులు వెల్లడించారు. ఈ అనుమానాస్పద మృతిపై కలమసేరి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక బృందం విచారణ జరిపి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కలమసేరి వైద్య కళాశాలకు తరలించింది. తొలిసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ట్రాన్స్‌జెండర్‌గా అనన్య చరిత్ర సృష్టించింది. 2021లో మలప్పురం జిల్లాలోని వెంగర నియోజకవర్గం నుంచి డెమొక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన ఆమెను సొంత పార్టీ నాయకులే బెదిరించారు. దీంతో అనన్య పోటీ నుంచి విరమించుకుంది. కొల్లంలోని పెరుమోన్ లో జన్మించిన అనన్య చిన్నతనంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంది. తర్వాత ట్రాన్స్ రైట్స్ కార్యకర్తగా మారి మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతేకాదు, ఆమె న్యూస్ ప్రెజెంటర్‌గా, మేకప్ ఆర్టిస్ట్‌గా కూడా పని చేసింది.

    అయితే ఆమె అకాల మరణం పట్ల చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కేరళ రాష్ట్ర లింగమార్పిడి జస్టిస్ బోర్డు సభ్యుడు అనిల్ మాట్లాడుతూ.. "ఆమె మరణించారన్న నిజం చాలా బాధిస్తోంది. సెక్స్ రీసైన్మెంట్ సర్జరీ చేయించుకున్న ఆమె గత ఒక సంవత్సరం నుండి తీవ్ర నొప్పితో బాధపడుతోంది. తనకు నచ్చిన జీవితాన్ని గడపాలనే చాలా ఆశతో సర్జరీ చేయించుకుంది. కేరళ రాష్ట్రంలో లింగ మార్పిడి ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి ఎటువంటి రూల్స్ లేవు. ఇటువంటి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ట్రం ఒక ప్రోటోకాల్‌ను రూపొందించాలి. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలి” అని వ్యాఖ్యానించారు.
    Published by:Veera Babu
    First published: