ఆమె లాడ్జికి రమ్మనగానే వెళ్లిపోయాడు.. ఊహించని ట్విస్ట్‌తో ఇలా బుక్కయ్యాడు..

రంగమ్మతో రాసలీలు బయటపడకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో మొదట రూ.5లక్షలు ఇచ్చి, మిగతాది తర్వాత ఇస్తానని చెప్పాడు. అప్పటినుంచి మిగతా డబ్బు కోసం వారు నిత్యం ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు.

news18-telugu
Updated: September 2, 2019, 10:54 AM IST
ఆమె లాడ్జికి రమ్మనగానే వెళ్లిపోయాడు.. ఊహించని ట్విస్ట్‌తో ఇలా బుక్కయ్యాడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తిరుపతిలో విధులు నిర్వర్తించే ఓ కానిస్టేబుల్‌కు ఇటీవల ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. తనతో ఆమె చనువుగా మాట్లాడుతుండటంతో.. అతనూ దగ్గరయ్యాడు. ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తరుచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఇదే క్రమంలో ఆమె కానిస్టేబుల్‌ను మరింత టెంప్ట్ చేసింది. లాడ్జిలో కలుద్దామా? అని అడిగింది.దీంతో ఆ కానిస్టేబుల్ కూడా మరో ఆలోచన లేకుండా సరేనన్నాడు. అనుకున్నట్టే ఇద్దరూ ఓరోజు లాడ్జిలో కలుసుకున్నారు.కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. కానిస్టేబుల్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన రంగమ్మ అనే మహిళ ఇటీవల తన కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లింది.అక్కడ సుబ్బయ్య అనే ఓ కానిస్టేబుల్‌తో మాటలు కలిపింది. ఫోన్ నంబర్ తీసుకుంది. అప్పటినుంచి అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది.లాడ్జిలో కలుసుకుందామని అతన్ని మరింత ముగ్గులోకి దించింది. కానిస్టేబుల్ కూడా అందుకే సరేనన్నాడు. ఈ నెల 16న ఇద్దరూ ఓ లాడ్జిలో కలుసుకున్నారు.అంతే.. కాసేపటికే తలుపును ఎవరో పెద్దగా బాదడం మొదలుపెట్టారు.

వెళ్లి తలుపు తీయగా.. అనంతపురం కానిస్టేబుల్ శ్రీనివాసులు,మరో ఇద్దరు వ్యక్తులు అతనితో పాటు ఉన్నారు. ఇద్దరినీ ఫోటోలు తీశారు. దీంతో కానిస్టేబుల్ సుబ్బయ్య కాళ్లా వేళ్లా పడి బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. ఇదంతా బయటపడకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో మొదట రూ.5లక్షలు ఇచ్చి, మిగతాది తర్వాత ఇస్తానని చెప్పాడు. అప్పటినుంచి మిగతా డబ్బు కోసం వారు నిత్యం ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు. దీంతో వేధింపులను భరించలేక సుబయ్య ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.తమను ఫోటోలు తీసి బెదిరించిన ఆ ముగ్గురు రంగమ్మ మనుషులేనని తేలింది. డబ్బు కోసమే తనను ముగ్గులోకి దింపి లాడ్జికి తీసుకెళ్లిందని తేలింది. దీంతో సుబ్బయ్య షాక్ తిన్నాడు. అతని ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
First published: September 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading