విహారయాత్రలో విషాదం... అనంతపురం జిల్లా స్కూల్ బస్సు బోల్తా

భారీ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు సమాచారం.అయితే లోయలో బస్సు బడిపోతున్న సమయంలో చెట్టు అడ్డుగా రావడంతో ప్రమాద తీవ్రత తగ్గినట్లుగా తెలుస్తోంది.

news18-telugu
Updated: January 4, 2020, 9:54 AM IST
విహారయాత్రలో విషాదం... అనంతపురం జిల్లా స్కూల్ బస్సు బోల్తా
బోల్తా పడిన బస్సు
  • Share this:
విద్యార్థుల విజ్ఞాన యాత్ర విషాదయాత్రగా మారింది. అనంతపురం జిల్లా కదిరి నుంచి విహారయాత్రకు పాఠశాల విద్యార్థులు వెళ్లారు. అయితే వీరంతా ప్రయాణిస్తున్న బస్సు దార్వాడ్ వద్ద స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందాడు. మరో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థులు బయటకు వచ్చారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన బాబా ఫకృద్దీన్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాదానికి సంబంధించిన సమాచారం అక్కడ కర్నాటక అధికారులు అనంతపురం జిల్లా అధికారులకు సమాచారం అందించారు.

దీంతో విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. స్వల్పగాయాలు అయిన విద్యార్థుల్ని వెంటనే ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసి అనంతపురం జిల్లా కదిరికి తరలిస్తున్నారు. వాటర్ ఫాల్స్ చూసి తిరిగి వస్తుండగా భారీ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు సమాచారం.అయితే లోయలో బస్సు బడిపోతున్న సమయంలో చెట్టు అడ్డుగా రావడంతో ప్రమాద తీవ్రత తగ్గినట్లుగా తెలుస్తోంది.మరోవైపు ఈ ప్రమాదంపై జగన్ ఆరా తీశారు. వెంటనే విద్యార్థులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు.

First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు