‘O’పాజిటివ్ అయితే.. ‘B’ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు...బాలింత మృతి

రక్తం మారడంతో బాను పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

news18-telugu
Updated: June 29, 2019, 4:35 PM IST
‘O’పాజిటివ్ అయితే.. ‘B’ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు...బాలింత మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనంతపురం ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం బలి తీసింది.  ఆస్పత్రిలో అక్తర్ బాను అనే మహిళ డెలివరీ అయ్యింది. అయితే ఆమెకు ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాల్సిన ... సిబ్బంది బీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు. రక్తం మారడంతో బాను పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వైద్యుల వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆస్పత్రి అధికారులపై సీరియస్ అయ్యారు. అనంత ఆస్పత్రి సూపరెండెంట్ జగన్నాథంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

First published: June 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు