• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • AN OLD MAN SEXUALLY ASSAULTED GIRL NEAR TIRUPATHI PRN

Crime: బిస్కెట్లు కొనిస్తానని మనవరాలిని తీసుకెళ్లిన తాత.., తర్వాత ఏం జరిగిందంటే..!

Crime:  బిస్కెట్లు కొనిస్తానని మనవరాలిని తీసుకెళ్లిన తాత.., తర్వాత ఏం జరిగిందంటే..!

ప్రతీకాత్మక చిత్రం

చిత్తూరు జిల్లాలో బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి చేశాడు. బిస్కెట్లు కొనిస్తానని తీసుకెళ్లి అకృత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేశారు.

  • Share this:
    చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తిరుపతి సమీపంలో 12 ఏళ్ల బాలికపై 65ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బిస్కెట్లు కొనిస్తానని ఆశచూపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.., నాగలాపురానికి చెందిన శివలింగం వరుసకు మనవరాలు అయ్యే బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందింతుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరిక్షను నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తెను నమ్మించి ఇలాంటి అకృత్యానికి పాల్పడిన నిందితుడిపై బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివలింగాన్ని కఠినంగా శిక్షించాలని కోరారు.

    నిందితుడిపై పోక్సా, దిశా చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. అత్యాచారాల నివారణకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా అడ్డుకట్టపడటం లేదు. ఇటీవల రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో నిందితులు సులువుగా బయటకు వస్తున్నారు. ఈ తరహా కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందులను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.

    తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లో నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు