హోమ్ /వార్తలు /క్రైమ్ /

Pune cab driver: క్యాబ్‌లో కూర్చున్న తర్వాత ఆమెకు దాహమేసింది.. మొహమాటపడుతూనే డ్రైవర్ ఇచ్చిన వాటర్ తాగాక...

Pune cab driver: క్యాబ్‌లో కూర్చున్న తర్వాత ఆమెకు దాహమేసింది.. మొహమాటపడుతూనే డ్రైవర్ ఇచ్చిన వాటర్ తాగాక...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ 32 ఏళ్ల మహిళ ధయారి ప్రాంతంలోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. కొద్దిసేపటికి క్యాబ్ అక్కడికి వచ్చింది. ఆమె క్యాబ్‌లో ఎక్కి వెళుతుండగా కొంత దూరం వెళ్లాక ఆమెకు దాహమేసింది. కానీ.. సమయానికి ఆమె దగ్గర తాగడానికి నీళ్లు లేవు. దీంతో.. ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెకు తాగడానికి...

ఇంకా చదవండి ...

పుణె: సమాజంలో మహిళల భద్రత నానాటికీ ప్రశ్నార్థకంగా మారుతోంది. మనిషి తోలు కప్పుకున్న కొన్ని మానవ మృగాలు ఒంటరి మహిళలే టార్గెట్‌గా అకృత్యాలకు పాల్పడుతున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పుణెలోని ఖరడి ప్రాంతానికి చెందిన ఓ 32 ఏళ్ల మహిళ ధయారి ప్రాంతంలోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. కొద్దిసేపటికి క్యాబ్ అక్కడికి వచ్చింది. ఆమె క్యాబ్‌లో ఎక్కి వెళుతుండగా కొంత దూరం వెళ్లాక ఆమెకు దాహమేసింది. కానీ.. సమయానికి ఆమె దగ్గర తాగడానికి నీళ్లు లేవు. దీంతో.. ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెకు తాగడానికి నీళ్లిచ్చాడు. ఆ నీళ్లు తాగకూడదనుకుంటేనే.. బాగా దాహం వేయడంతో తప్పక తాగింది. ఆ క్యాబ్ డ్రైవర్ దుర్భుద్దితో ఆమె తాగిన నీళ్లలో మత్తు మందు కలిపాడు. ఆ విషయం తెలియని సదరు మహిళ దాహంతో గొంతు తడారిపోవడంతో ఆ నీళ్లను తాగింది. కొద్దిసేపటికి ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను ధయారి ప్రాంతంలోని గోకుల్ లాడ్జికి తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ ప్రమోద్ బాబు ఆమెను రూంలోకి తీసుకెళ్లి వివస్త్రను చేశాడు. తన స్మార్ట్‌ఫోన్‌తో నగ్నంగా ఉన్న ఆమెను ఫొటోలు, వీడియోలు తీశాడు. అనంతరం.. కొద్దిసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది. నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీశానని.. తనకు సహకరించకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తానని స్పృహలోకి వచ్చిన ఆమెను బెదిరించాడు. ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తను కోరుకున్న సమయంలో తన దగ్గరకు రావాలని ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తాడేమోనన్న భయంతో ఆమె అయిష్టంగానే అతని వద్దకు వెళ్లేది. రోజురోజుకూ వేధింపులు పెరిగిపోవడంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాబ్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడిని ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

పుణెలోని కత్రాజ్ ప్రాంతంలో ఇలాంటి మరో ఘటన వెలుగుచూసింది. 14 ఏళ్ల వయసున్న బాలిక ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన వ్యక్తి పిలిచాడని లాడ్జికి వెళ్లింది. అక్కడ ఆమెపై ఆ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ప్రశాంత్ గైక్వాడ్ అనే ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

First published:

Tags: Crime, Crime news, Pune news, RAPE

ఉత్తమ కథలు