పిలక ఉందని భర్త నుంచి విడాకులు కోరిన భార్య... పెళ్లైన రెండేళ్లకు...

భర్త పిలక ఉంచుకోవడం నచ్చడం లేదంటూ విడాకులు కోరిన మహిళ... యువతి వింత కోరిక విని షాకైన న్యాయమూర్తులు..

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 14, 2019, 2:31 PM IST
పిలక ఉందని భర్త నుంచి విడాకులు కోరిన భార్య... పెళ్లైన రెండేళ్లకు...
భర్తకు పిలక ఉందని... విడాకులు కోరిన భార్య...
  • Share this:
భర్త పిలక ఉంచుకోవడం నచ్చడం లేదంటూ ఓ భార్య, అతని నుంచి విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మరీ ఇంత చిన్న విషయానికే డైవర్స్ కావాలంటూ గోడవ పెట్టిందని ఆమె మరీ చదువుకోనిదో, తెలివి లేనిదో కూడా కాదు. MBA మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన గృహిణి... వాళ్ల ఆయన ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ ఏరియాలో వెలుగుచూసింది. భోపాల్ ఏరియాలో నివాసముంటున్న ప్రవీణ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... ఎమ్‌బీఏ చదివిన ప్రత్యూష అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ రెండేళ్లు కాపురం కూడా చేశారు. అయితే కొన్నాళ్ల క్రితం హెయిర్ కటింగ్‌కు వెళ్తున్నానంటూ బయటికి వెళ్లిన ప్రవీణ్... వచ్చేటప్పుడు పిలక మాత్రం ఉంచుకుని క్లీన్‌షేవ్ చేయించుకుని వచ్చాడు. భర్త అవతారం చూసిన ప్రత్యూష... గుండు చేసుకుంటే చేసుకున్నారు కానీ ఆ పిలక తీసేయమని కోరింది. దానికి అతను అంగీకరించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భర్త పిలకతో ఏ మాత్రం బాగోలేడని, అందరూ నవ్వుతున్నారని, తాను చూసి భరించలేకపోతున్నానంటూ కోర్టుకెక్కింది ప్రత్యూష. తన మాట వినని భర్తతో కలిసి కాపురం చేయలేనంటూ విడాకులు కావాలంటూ న్యాయమూర్తులను కోరింది.

ఆమె మాటలు విని నవ్వుకున్న న్యాయమూర్తి... ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ తీర్పు వెలువరించింది. భోపాల్‌లోనే ఇదే రకమైన మరోకేసు వెలుగుచూసింది. భర్త మీసాలు నచ్చడం లేదంటూ కోర్టుకెక్కిందో మహిళ. భర్త చేత మీసాలు అయినా తీయించండి లేదా విడాకులు అయినా ఇప్పించండి అంటూ కోర్టుకు ఎక్కిందో మహిళ.
First published: May 14, 2019, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading