అమృతను పెళ్లి చేసుకుంటా.. లేఖ రాసి, ఫోటోలు పెట్టిన అగంతకుడు..

ప్రణయ్ భార్య అమృత, అతని తల్లి..(Image:Facebook)

ప్రణయ్ హత్య ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆమె పట్ల ఓ అగంతకుడు తప్పుగా వ్యవహరించాడు. అమృతను తాను పెళ్లి చేసుకుంటానని ఇంటి గేటుకు లేఖ, తన వివరాలు పెట్టి వెళ్లిపోయాడు.

  • Share this:
    ఇప్పటికే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త ప్రణయ్ హత్యతో అమృత పుట్టెడు దు:ఖంలో ఉంది. ఆమెను ఓదార్చి, ధైర్యం చెప్పాల్సింది పోయి, ఎగతాళి చేస్తున్నారు కొందరు. ప్రణయ్ హత్య ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆమె పట్ల ఓ అగంతకుడు తప్పుగా వ్యవహరించాడు. ఈ నెల 11న ప్రణయ్ వర్ధంతి సందర్భంగా అతడికి నివాళి అర్పించేందుకు కుటుంబం మొత్తం లక్ష్మీ గార్డెన్స్‌కు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న ఓ అజ్ఞాత యువకుడు.. ఇంటి గేటుకు కవరు పెట్టి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఆ కవర్‌లో ఓ లేఖ, ఫొటోలు ఉన్నాయి. అమృతను తాను పెళ్లి చేసుకుంటానని అతడు అందులో తన వివరాలు రాసినట్లు ఉన్నాయి. భర్త వర్ధంతి రోజే ఇలాంటి లేఖలు రాయడం అమృతను మరింత కుంగదీసింది.

    కాగా, తన భర్త హత్య కేసును నీరు గార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంగళవారం మీడియాతో అమృత ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన భర్త, మామ.. ఎస్సీ కాదని, క్రైస్తవులని కేసును తప్పుదోవ పట్టించేలా కొందరు కుట్ర చేస్తున్నారని తెలిపింది. తన భర్త కుటుంబం ఎస్సీ అని ప్రభుత్వ అధికారులే సర్టిఫై చేశారని, ఏ ఆధారాలతో క్రైస్తవులు అని అంటారని అమృత ప్రశ్నించింది. తాము ఆర్యసమాజ్ పెళ్లి చేసుకున్నామని, పెళ్లి పత్రికను హనుమాన్ ఆలయంలో ఉంచామని, గుళ్లు గోపురాలు తిరిగామని వెల్లడించింది.
    First published: