ఫోన్‌లో పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేసిన ఇండియన్ పైలట్... అమెరికాలో అరెస్ట్...

శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ భారతీయ పైలట్‌ అరెస్ట్... పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు డౌన్‌లోడ్ చేస్తున్నాడనే అనుమానంతో రెండు నెలల నుంచి అతని నెట్ వాడకంపై నిఘా... చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తున్నాడని నిర్ధారణ అవ్వగానే అరెస్ట్ చేసేందుకు ప్రణాళిక... సంకెళ్లు వేసి, ప్రయాణికులందరి ముందు విమానం నుంచి దించేసిన కస్టమ్స్ అధికారులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 9, 2019, 6:44 PM IST
ఫోన్‌లో పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేసిన ఇండియన్ పైలట్... అమెరికాలో అరెస్ట్...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 9, 2019, 6:44 PM IST
మొబైల్‌లో పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు డౌన్‌లోడ్ చేసినందుకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ భారతీయ పైలట్‌ను అరెస్ట్ చేశారు. న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వెళ్లిన సదరు పైలట్... అక్కడ విమానాశ్రయంలో విమానాన్ని దించగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి సదరు పైలట్‌ను సంకెళ్లు వేసి, ప్రయాణికులందరి ముందు విమానం నుంచి దించేశారు. సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటనలో అరెస్ట్ అయ్యిన పైలట్ 50 ఏళ్ల వయసు పైబడిన అతను కావడం విశేషం. అమెరికా ఫెడరల్ చట్టం ప్రకారం పిల్లలకు సంబంధిన ఫోటోలు గానీ, వీడియోలు గానీ చూడడం లేదా, షేర్ చేయడం నేరం. స్నేహితుల ఫోన్లలో అలాంటి అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని తెలిసి, పోలీసులకు సమాచారం ఇవ్వకపోయినా చట్టరీత్యానేరంగా పరిగణిస్తారు. పిల్లలపై జరుగుతున్న నేరాలను నిరోధించే ఉద్దేశంతో చైల్డ్ పోర్నోగ్రఫీని నిషేధించింది అమెరికన్ ప్రభుత్వం. భారతదేశంలో కూడా ఇలాంటి చట్టమే ఈ ఏడాది అమలులోకి వచ్చింది. అయినప్పటికీ దాన్ని పెద్దగా పట్టించుకోని కొందరు ఇలాంటి వీడియోలు, ఫోటోలు డౌన్‌లోడ్ చేస్తూనే ఉన్నారు.

చైల్డ్ పోర్నోగ్రఫీ అమెరికాలో చాలా కఠినమైన నేరంగా పరిగణిస్తారు.


Indian pilot arrested, San Francisco, Downloading Child Pornography, Child Porn Videos in mobile, New Delhi Flight, San Francisco airport, Mumbai based Pilot arrested, image of child pornography, FBI, అమెరికాల భారతీయ పైలెట్ అరెస్ట్, చైల్డ్ పోర్న్ వీడియోలు, మొబైల్‌లో ఆ వీడియోలు ఉన్నాయని ఇండియన్ పైలెట్ అరెస్ట్, శాన్ ఫ్రాన్సికో, అమెరికా చట్టాలు, పిల్లలపై చిత్రీకరించిన అశ్లీల చిత్రాలు నిషేధం
అమెరికన్ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే 15 నుంచి 30 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు.


తాజాగా సదరు భారతీయ పైలట్ కూడా ఇలాంటి వీడియోలనే ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసినట్టు గుర్తించిన పోలీసులు... అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వెళ్లే మార్గంలో విమానాలకు నడిపే ఆ పైలట్ పాస్‌పోర్టును సీజ్ చేసిన అధికారులు... అతని యూఎస్ విసాను రద్దు చేశారు. ఈ సంఘటన తర్వాత అతను మళ్లీ అమెరికా రాకుండా నిషేధం కూడా విధించారు. ఉద్యోగరీత్యా అమెరికా వచ్చి వెళ్తుండే సదరు పైలట్‌పై అనుమానం వచ్చిన ఎఫ్‌బీఐ అధికారులు... రెండు నెలలుగా అతని ఇంటర్‌నెట్ వాడకంపై నిఘా పెట్టారు. చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తున్నాడని నిర్థారణ అవ్వగానే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అతను అమెరికాకి వచ్చేదాకా ఎదురుచూస్తూ ఉన్న యూఎస్ బ్యూరో ఆఫ్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రోటక్షన్ అధికారులు... విమానం ల్యాండ్ అయిన 15 నిమిషాల్లోనే పైలట్‌ను అరెస్ట్ చేశారు. భారతీయ పైలట్‌ను అరెస్ట్ చేసిన అమెరికన్ అధికారులు... అతని ఇంటర్‌నెట్ వాడకానికి సంబంధించిన సీల్డ్ రికార్డును భారతీయ అధికారులకు పంపించింది.

First published: March 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...