Home /News /crime /

School Teacher: చూడటానికి ఇంత పద్ధతిగా కనిపిస్తున్న ఈ హైస్కూల్ టీచర్ ఏం చేశాడో చూడండి..

School Teacher: చూడటానికి ఇంత పద్ధతిగా కనిపిస్తున్న ఈ హైస్కూల్ టీచర్ ఏం చేశాడో చూడండి..

మలప్పన్ (ఫైల్ ఫొటో)

మలప్పన్ (ఫైల్ ఫొటో)

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే బుద్ధి గడ్డి తిని కామంతో కన్నూమిన్నూ కానరాకుండా ప్రవర్తించిన ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లా రాణెబెన్నూరు తాలూకాలో చోటుచేసుకుంది.

    హవేరి: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే బుద్ధి గడ్డి తిని కామంతో కన్నూమిన్నూ కానరాకుండా ప్రవర్తించిన ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లా రాణెబెన్నూరు తాలూకాలో చోటుచేసుకుంది. దేవగుడి అనే గ్రామంలో ఉన్న హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న మలప్పన్ ఓ వ్యక్తి కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. స్కూల్‌‌లో పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై కన్నేసిన ఇతగాడు ఆన్‌లైన్ క్లాసుల వంకతో ఆ విద్యార్థిని ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆమెకు వాట్సాప్‌లో నీలిచిత్రాల వీడియోలు, నగ్న ఫొటోలు పంపుతూ ఆమెతో నీచంగా ప్రవర్తించాడు. ఆ బాలిక తల్లిదండ్రులకు ఈ ప్రబుద్ధుడి గురించి చెప్పడంతో గ్రామస్తులు, ఆమె తల్లిదండ్రులు బాలికను వెంటబెట్టుకుని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    అంతేకాకుండా.. విద్యాశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో.. అతని తప్పు ఉందని తేలడంతో మలప్పన్‌ను ఉద్యోగం నుంచి విద్యా శాఖ తొలగించింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే ఇలా దారి తప్పి ప్రవర్తిస్తే మంచేదో, చెడేదో ఇక ఎవరు చెబుతారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కీచక గురువులను కఠినంగా శిక్షించాలని, మళ్లీ విద్యార్థినితో అలా ప్రవర్తించాలంటే భయపడేలా శిక్ష ఉండాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Karnataka, Teacher misbehave

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు