హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sad Incident: ఎంత చక్కగా ఉన్నావమ్మా.. కానీ నువ్విలా చేస్తే అమ్మానాన్న ఏమైపోవాలమ్మా..

Sad Incident: ఎంత చక్కగా ఉన్నావమ్మా.. కానీ నువ్విలా చేస్తే అమ్మానాన్న ఏమైపోవాలమ్మా..

శ్రుతి (ఫైల్ ఫొటో)

శ్రుతి (ఫైల్ ఫొటో)

ప్రేమ ఇద్దరి మనుషులను ఒక్కటి చేస్తుంది. అదే ప్రేమ ఎందరో ప్రేమికులకు విషాదాంతాన్ని మిగిల్చింది. కర్ణాటకలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది.

గుల్బర్గా: ప్రేమ ఇద్దరి మనుషులను ఒక్కటి చేస్తుంది. అదే ప్రేమ ఎందరో ప్రేమికులకు విషాదాంతాన్ని మిగిల్చింది. కర్ణాటకలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ప్రమాదవశాత్తూ తాను ఎంతగానో ప్రేమించిన యువకుడు చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన 18 ఏళ్ల యువతి అతను చనిపోయిన నెల రోజులకు ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రుతి అనే యువతి కలబురగిలో సెకండరీ పీయూసీ చదువుతోంది. బసవన బగేవది ప్రాంతానికి చెందిన హన్మంత అనే బంధువుల కుర్రాడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇద్దరూ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రేమలో మునిగిపోయారు. సినిమాలకు, షికార్లకు కూడా కలిసి వెళుతుండేవారు. కొన్నాళ్ల తర్వాత ఇంట్లో వాళ్లకు వీరి ప్రేమ గురించి తెలిసింది.

వరుసగా బావామరదలు కావడం, ఇద్దరూ ఇష్టపడటంతో ఇరు కుటుంబాలు కూడా పెళ్లికి అంగీకరించాయి. అయితే.. ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండే హన్మంత దురదృష్టవశాత్తూ కొద్దిరోజుల క్రితం కాలు జారి బావిలో పడి చనిపోయాడు. అంతగా ప్రేమించిన మనిషి ఇక లేడనే విషయాన్ని శ్రుతి జీర్ణించుకోలేకపోయింది. హనుమంత చనిపోయి రోజులు గడుస్తున్నా శ్రుతి మాత్రం మర్చిపోలేక ఏడుస్తూ కుమిలిపోయింది. ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవించాలనుకున్న తన ఆశలు అడియాసలు కావడంతో ప్రేమించినవాడినే తలచుకుంటూ బాధపడుతూ ఉండేది.

ఇది కూడా చదవండి: Ticket Issuer: రైల్వే స్టేషన్‌లో టికెట్లు ఇచ్చే ఉద్యోగం.. డ్యూటీకి వెళ్లిన వాడివి బుద్ధిగా పని చేసుకోక భార్యతో కలిసి ఇదేం పని..

కొన్ని రోజులుగా సరిగా తినడం మానేసింది. నిద్రపోకుండా అతనినే తలచుకుంటూ కుమిలిపోయింది. కూతురి పరిస్థితి చూసిన ఆమె తల్లిదండ్రులు ఇక మర్చిపోవాలని, నీకంటూ ఒక జీవితం ఉందని కూతురిని మార్చేందుకు ప్రయత్నించారు. ఆమె ఇంట్లోనే ఉంటే అతనినే తలచుకుంటూ బాధపడుతుందని భావించిన ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆమెకు పెళ్లి సంబంధం చూశారు. గతం మర్చిపోయి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు సూచించారు.

ఇది కూడా చదవండి: Youtube: యూట్యూబ్‌లో ఏందీ రోత వీడియోలు.. ఇంతకీ ఈమె ఎవరో.. చివరకు ఏమైందో తెలుసా..!

అయితే.. హన్మంతపై ఉన్న ఇష్టాన్ని చంపుకోలేకపోయిన శ్రుతి క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తిని తప్ప మరొకరిని భర్త స్థానంలో ఊహించుకోలేనని భావించిన ఆమె ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని భావించిన ఆమె తల్లిదండ్రులు కడుపుకోతతో కుమిలిపోయారు.

ఇది కూడా చదవండి: Newly Married: భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు.. వింతేముంది అనుకోకండి.. ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

ఇలా ప్రేమికులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. శ్రుతి తీసుకున్న నిర్ణయం ఆమె తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రేమించిన వాడిపై ఇష్టాన్ని చంపుకోలేక ప్రాణాలు తీసుకున్న శ్రుతి కన్న వాళ్ల గురించి ఒక్క క్షణం ఆలోచించినా వారికి ఈ కడుపుకోత ఉండేది కాదని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన ఆమె కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.

First published:

Tags: Bangalore, Crime news, Karnataka, Lover

ఉత్తమ కథలు