హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Video : పాట్నా రైల్వేస్టేషన్‌లో ప్లే అయిన బూతు వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

Video : పాట్నా రైల్వేస్టేషన్‌లో ప్లే అయిన బూతు వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

పాట్నా రైల్వేస్టేషన్‌లో ప్లే అయిన బూతు వీడియో (image credit - instagram - gieddeee)

పాట్నా రైల్వేస్టేషన్‌లో ప్లే అయిన బూతు వీడియో (image credit - instagram - gieddeee)

Video : రైల్వేస్టేషన్‌లోని అధికారిక టీవీల్లో బూతు వీడియో ప్లే అయితే.. ఇంకేమన్నా ఉందా? ప్రయాణికుల మతిపోయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పాట్నా రైల్వేస్టేషన్‌లో పోర్నోగ్రాఫిక్ వీడియో ప్లే అయిన ఘటనపై FIR నమోదైంది. సోమవారం ఉదయం ఈ వీడియో ప్లే అయ్యింది. రైల్వేస్టేషన్‌లోని టీవీ స్క్రీన్లపై ఈ వీడియో 3 నిమిషాలపాటూ ప్లే అయ్యింది. ఈ బూతు వీడియో ప్లే అవ్వడానికి కారణం ఆ సంస్థే అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రైవేట్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వీడియో ప్లే అయిన సమయంలో... రైల్వేస్టేషన్‌లో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. బీహార్ రాజధాని అయిన పాట్నా స్టేషన్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అక్కడి నుంచి ఢిల్లీ , బెంగళూరు సహా చాలా రాష్ట్రాలకు వలస కూలీలు వెళ్తుంటారు. అలాంటి జంక్షన్‌లో పోర్నోగ్రఫీ వీడియో 3 నిమిషాలు ప్లే అవ్వడం అనేది మామూలు విషయం కాదు కదా.

ఆ వీడియో ఇదే

View this post on Instagram

A post shared by @gieddeee

ఈ వీడియో ప్లే అయినప్పుడు స్టేషన్‌లో ఉన్న వందల మంది ప్రయాణికుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. స్టేషన్‌లోని 10 ప్లాట్ ఫారంలలోని టీవీలలో ఈ వీడియో ప్లే అవ్వడంతో.. ప్రయాణిలకు దిమ్మ తిరిగింది. ఇదేంటి ఇలాంటి వీడియో ప్లే అవుతోందని వారంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో పిల్లలకు కనిపించకుండా చేయడానికి వారు నానా తిప్పలు పడ్డారు. కొంతమంది ప్రయాణికులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గానీ ఆ వీడియో పోలేదు.

దీనిపై పాట్నా RPF వెంటనే రంగంలోకి దిగి.. RPF చట్టం ప్రకారం కేసు రాసింది. కోల్‌కతాకి చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ.. రైల్వేస్టేషన్‌లోని టీవీ స్క్రీన్లపై రెగ్యులర్‌గా అనౌన్స్‌మెంట్స్ వేసే కాంట్రాక్ట్ పొందింది. ఆ ఏజెన్సీ.. రైళ్ల రాకపోకల వివరాల్ని టీవీ స్క్రీన్లపై చూపిస్తోంది. ఇప్పుడు ఆ ఏజెన్సీతో కాంట్రాక్ట్‌ని రద్దు చేసిన రైల్వే అధికారులు.. ఏజెన్సీ నిర్వాహకులను రమ్మని సమన్లు జారీ చేశారు.

ఈ వీడియోకి కారణం అయినవారిని త్వరలోనే RPF లేదా.. రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ వారు అరెస్టు చేస్తారని తెలిసింది. మొత్తంగా ఈ ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ పోర్నోగ్రఫీ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

First published:

Tags: Patna, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు