చదువుకుందామని ట్యూషన్‌కు వెళ్తే.. టీచర్ భర్త ఎక్కడెక్కడో టచ్ చేస్తూ..

Sexual Harassment: ట్యూషన్ టీచర్ భర్త(53) తనను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు ఆ తల్లిదండ్రులు. అంతేకాదు.. మూడేళ్లుగా తనను ఇలా చేస్తున్నాడని చెప్పడంతో ఒక్కసారిగా విస్తుపోయారు.

news18-telugu
Updated: August 22, 2019, 6:07 PM IST
చదువుకుందామని ట్యూషన్‌కు వెళ్తే.. టీచర్ భర్త ఎక్కడెక్కడో టచ్ చేస్తూ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పంజాబ్‌లోని నంగాల్‌కు చెందిన ఆ బాలిక వయసు ఎనిమిదేళ్లు.. లోకం గురించి తెలిసీ తెలియని ఈడు.. ఉదయం పూట పాఠశాలకు వెళ్లి, సాయంత్రం పూట ట్యూషన్‌కు వెళ్లి చదువుకుంటోంది. బాగానే చదువుతోంది కదా అని ఆ బాలిక తల్లిదండ్రులు కూడా ఆమెను క్రమం తప్పకుండా ట్యూషన్‌కు పంపిస్తున్నారు. కానీ, నాలుగు రోజుల క్రితం తాను ట్యూషన్‌కు వెళ్లనని మారాం చేసింది. కూతురు ఎందుకిలా చేస్తోందని ఆమెను అడగ్గా.. ట్యూషన్ టీచర్ భర్త(53) తనను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు ఆ తల్లిదండ్రులు. అంతేకాదు.. మూడేళ్లుగా తనను ఇలా చేస్తున్నాడని చెప్పడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని అడగ్గా.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు వెల్లడించింది.

దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాను అలా చేయలేదని వెల్లడించాడు. కొంతకాలం క్రితం జరిగిన గొడవపై ఇలా పగ తీర్చుకోవాలని ఆ బాలిక తల్లిదండ్రులు చూస్తున్నారని నిందితుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు