హోమ్ /వార్తలు /క్రైమ్ /

Kerala High Court: కేరళ కోర్టుకెక్కిన ఎనిమిదేళ్ల బాలిక.. తనను అవమానించిన​ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్​

Kerala High Court: కేరళ కోర్టుకెక్కిన ఎనిమిదేళ్ల బాలిక.. తనను అవమానించిన​ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్​

కేరళ హైకోర్టు

కేరళ హైకోర్టు

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది ఒక బాలిక. తనపై కేరళ పింక్ పోలీసులు తప్పుడు కేసు పెట్టి బహిరంగంగా అవమానపరిచారని, గౌరవంగా జీవించే ప్రాథమిక హక్కును పరిరక్షించాలని కోరుతూ కేరళ హైకోర్టును ఆమె ఆశ్రయించింది.

ఇంకా చదవండి ...

ఈ తరం పిల్లలకు తప్పు అంటే ఏంటి? తప్పులు చేసిన వారికి ఎలాంటి శిక్షలు విధిస్తారు? నిర్దోషులకు ఎలాంటి రక్షణ ఉంటుందనే విషయాలు చిన్నప్పటి నుంచే తెలుస్తున్నాయి. కొందరు చిన్నారులు ఇంట్లో వాళ్లపై ఫిర్యాదులు (Complaints) చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన పోలీసులపై (police) చర్యలు తీసుకోవాలని ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది ఒక బాలిక (girl). తనపై కేరళ పింక్ పోలీసులు (Kerala pink police) తప్పుడు కేసు పెట్టి బహిరంగంగా అవమానపరిచారని, గౌరవంగా జీవించే ప్రాథమిక హక్కు (human right)ను పరిరక్షించాలని కోరుతూ కేరళ హైకోర్టు (Kerala high-court)ను ఆమె ఆశ్రయించింది. న్యాయసూత్రాల ప్రకారం తక్షణమే తనకు రక్షణ కల్పించి, గౌరవంగా జీవించే విధంగా చూడాలని రంజిత (ranjitha) అనే ఎనిమిదేళ్ల బాలిక న్యాయస్థానం (court) మెట్లెక్కింది.

తన మొబైల్ ఫోన్ (mobile phone) దొంగిలించినట్లు ఒక మహిళా పోలీసు అధికారి తమపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోనేలా కేరళ ప్రభుత్వాన్ని (Kerala government) ఆదేశించాలంటూ రంజిత హైకోర్టును కోరింది.

వివరాల్లోకి వెళ్తే.. విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (Vikram sarabhai space center) వద్ద సొరంగం తవ్వే యంత్రాలను వీక్షించడానికి జనం భారీగా వచ్చారు. అక్కడి జనాలను నియంత్రించడానికి పింక్ పెట్రోలింగ్ స్క్వాడ్‌ (patrolling squad)తో పాటు సివిల్ పోలీసులను కూడా మోహరించారు. అక్కడి పింక్ పెట్రోలింగ్ వాహనానికి మూడు మీటర్ల దూరంలో బాలిక తండ్రి (girl father) స్కూటర్‌ నిలిపారు. దాహం వేయడంతో పిటిషనర్, ఆమె తండ్రి సమీపంలోని దుకాణానికి వెళ్లారు. ఆ తరువాత పోలీసులు గట్టిగా అరుస్తూ తమ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారని, తమ ఫోన్ ఇవ్వాలంటూ అరిచారని రంజిత (Ranjith) పిటిషన్‌లో పేర్కొంది. ఈ ఘటనలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పినా వారు వినకుండా అవమానకరంగా, దుర్భాషలాడారని బాధితులు చెప్పారు.

జనం మూగేసరికి బాలిక..

పిటిషనర్, ఆమె తండ్రి కారు ముందు సీటు నుంచి మొబైల్ ఫోన్ తీయడాన్ని తాను చూశానని ఈ కేసులో 4వ ప్రతివాది చెప్పారు. అయితే ఫోన్ దొంగిలించారనే నెపంతో తమ దుస్తుల్లో అసభ్యకరంగా సివిల్ పోలీసు అధికారి వెతికారని పిటిషనర్ ఆరోపించారు. జనం ముందు తమను ఉద్దేశపూర్వకంగా అవమానించారని, తమను బెదిరించారని చెప్పారు. పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయిస్తానంటూ బెదిరించారని రంజిత వెల్లడించింది. పోలీసుల బెదిరింపుల తరువాత చుట్టూ జనం మూగేసరికి బాలిక గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా మరో పోలీసు రంజిత బ్యాగ్ వెతకగా ఫోన్ లభ్యమైందని తెలిపారు.

తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని..

షెడ్యూల్డ్ కులానికి (SC) చెందిన తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని బాలిక పిటిషన్‌లో పేర్కొంది. ‘ఈ ఘటన నా బిడ్డపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు వారాలు సరిగా నిద్ర పోలేదు. కనీసం ఆన్ లైన్ తరగతులకు కూడా హాజరుకాలేకపోయింది.’ అని బాలిక తండ్రి పిటిషన్‌లో తెలిపారు. ఈ ఘటన తరువాత 2021 సెప్టెంబరులో రంజితను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని, భయం పోగొట్టడానికి కౌన్సెలింగ్ కు తీసుకువెళ్లాల్సి వచ్చిందని తండ్రి తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో తనకు పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 50,00,000 నష్టపరిహారం ఇప్పించాలని కూడా బాలిక పిటిషన్‌లో కోరింది.

First published:

Tags: High Court, Kerala, Minor girl, School girl

ఉత్తమ కథలు