దారుణం.. ఎనిమిదేళ్ల బాలికలపై సామూహిక అత్యాచారం.. అనంతరం ఏం చేశారంటే..

బెమెత్రా వద్ద తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: June 4, 2020, 7:50 AM IST
దారుణం.. ఎనిమిదేళ్ల బాలికలపై సామూహిక అత్యాచారం.. అనంతరం ఏం చేశారంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎనిమిదేళ్ల బాలికలపై రెండు వేర్వురు ప్రాంతాల్లో జరిగిన దారుణ ఉదంతమిది. ఓ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచోసుకోగా, మరొకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఎనిమిది సంవత్సరాల బాలికను కొంతమంది కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేసి జాతీయ రహదారిపై పడేసి వెళ్లిపోయారు. బెమెత్రా వద్ద తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. కొంతమంది తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు బాలిక పోలీసులకు చెప్పింది. మరో ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో జరిగింది. దౌసా జిల్లాలోని ఓ ఎనిమిది ఏళ్ల బాలిక మంగళవారం రాత్రి కన్పించకుండా పోయింది. ఆమెను బుధవారం తెల్లవారుజామును తన ఇంటికీ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో అచేతనంగా పడి ఉంది. బాలిక అత్యాచారానికి గురయ్యింది.
Published by: Narsimha Badhini
First published: June 4, 2020, 7:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading