యువతిపై రేప్... మసాజ్ పేరుతో ఆయుర్వేద డాక్టర్ నిర్వాకం

రేప్ దారుణాలకు పాల్పడుతున్న చాలా మంది లాగే ఆ డాక్టరూ వ్యవహరించాడు. కానీ పోలీసులు ఈ కేసుసు అత్యంత సీరియస్‌గా తీసుకొని డాక్టర్‌ను పట్టున్నారు.

news18-telugu
Updated: August 12, 2020, 1:54 PM IST
యువతిపై రేప్... మసాజ్ పేరుతో ఆయుర్వేద డాక్టర్ నిర్వాకం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పైకి ఆయుర్వేద డాక్టర్‌గా బిల్డప్. లోపల అత్యంత క్రూర మనస్తత్వం. 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ డాక్టర్‌ను మహారాష్ట్ర భివాండీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి పేరు సురేష్ వడయార్. పుణె... భిబ్వేవాడీలో ఆయుర్వేద క్లినిక్ నడుపుతున్నాడు. ఓసారి ఓ రిచ్ ఫ్యామిలీలో ఎవరికో అనారోగ్య సమస్య వచ్చింది. అప్పుడు ఆ ఇంటికి వెళ్లి ఆయుర్వేద ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. దాంతో... నయమైంది. అలా ఆ ఫ్యామిలీతో పరిచయం పెంచుకున్నాడు. ఆ ఇంట్లో యువతిపై కన్నేసిన డాక్టర్... ఖాళీ ఉన్నప్పడు ఆమెను ఓసారి క్లినిక్‌కి రమ్మన్నాడు. ఎందుకు డాక్టర్ అంటే... పంచకర్మ నిర్వహిస్తా అన్నాడు. అదేంటి డాక్టర్... అంటే... ఆయుర్వేదంలో అదో అద్భుత మసాజ్ అనీ... ఒంటినొప్పులన్నింటికీ అది చెక్ పెడుతుందనీ... ఇలాంటి ఏవో కల్లబొల్లి మాటలు చెప్పాడు. నిజమే అనుకుందామె. ఇంటర్నెట్‌లో చూస్తే... అదో మంచి ట్రీట్‌మెంట్ అని వీడియోలున్నాయి. సరదాగా చేయించుకుందామనుకుంది.

ఓ రోజు కారులో క్లినిక్‌కి వెళ్లింది. అక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది. అక్కడ కారును పార్క్ చేసి... చుట్టూ కోతులేమైనా ఉన్నాయేమోనని చూసింది. ఎందుకంటే ఇంతకు ముందు ఓసారి కోతులు ఆమె కారును నాశనం చేశాయి. అప్పటి నుంచి ఆమెకు కోతులంటే భయం. మూగ జీవాలైన కోతుల కంటే... మేక వన్నె పులుల లాంటి మనుషులు చాలా డేంజర్ అన్న విషయం ఆమెకు తర్వాత తెలిసింది. ఆమె కారులో రాగానే... పనులన్నీ ఆపేసి... ఆమె కోసం ఆబగా ఎదురుచూశాడు. రండి రండి అంటూ లోపలకి ఆహ్వానించాడు. క్లినిక్ మరీ పెద్దగా లేదు. మరీ చిన్నగా కూడా లేదు. చూడ్డానికి బాగుంది. అక్కడ ఓ టేబుల్‌పై పడుకోమన్నాడు. పడుకుంది.

ఓసారి నవ్వి... ఇలాకాదు... ఒంటిపై బట్టలు ఉండకూడదు అన్నాడు. మర్మాంగాలపై బట్టలు ఉండి... మిగతా అంతా తీసేయాలని చెప్పాడు. ఆల్రెడీ యూట్యూబ్‌లో వీడియోలు చూసిన ఆమె... అవును కదా అనుకుంది. డాక్టర్ నుంచి ప్రత్యేక మసాజ్ డ్రెస్ (మర్మాంగాల కోసం) తీసుకుంది. పక్క గదిలోకి వెళ్లి... తన డ్రెస్ తీసేసి... డాక్టర్ ఇచ్చిన మసాజ్ డ్రెస్ పీస్‌లను వేసుకుంది. ఇప్పుడు ప్రశాంతంగా వాలండి అన్నాడు. టేబుల్‌పై వాలింది. ఆ తర్వాత ఏవో నూనెల వంటివి బాడీపై పోస్తూ... మెల్లగా మసాజ్ స్టార్ట్ చేశాడు. అలా చేస్తూ చేస్తూ... ఆమె ప్రైవేట్ పార్ట్స్ వైపు చేతులు పోనిస్తుంటే... ఆమెకు అసౌకర్యంగా అనిపించింది. ఓసారి అతనివైపు సీరియస్‌గా చూసింది. సారీ... అన్నాడు. సరే అనుకుంది. మళ్లీ అలాగే చేశాడు. ఈసారి ఆమెకు క్లారిటీ వచ్చేసింది. వెంటనే లేచి... ఆ డ్రెస్ మార్చేసుకొని.. తన డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి సీరియస్‌గా చూస్తూ వెళ్లిపోయింది.

ఆ డాక్టర్ ఎంత కన్నింగ్ అంటే... ఆమె వెళ్లిపోయాక... మసాజ్ వీడియో, ఆ పక్క గదిలో డ్రెస్ మార్చుకున్నప్పు సీక్రెట్‌గా అమర్చిన వీడియోల ఫుటేజ్‌ను ఓ చోట దాచాడు. తర్వాత ఆమెకు కాల్ చేసి... క్షమాపణ చెప్పాడు. ఇకపై ఇలా చేయననీ... ఈసారి పద్ధతిగా చేస్తానని చెప్పి ఆమెను రమ్మన్నాడు. నిజమే అనుకొని వెళ్లింది. అప్పుడు క్లినిక్ మూసి వేసి... ఆమెకు సీసీటీవీ, సీక్రెట్ కెమెరా ఫుటేజ్ చూపించాడు. తాను చెప్పినట్లు చేయకపోతే... మొత్తం వీడియోలను నెట్‌లో పెడతానని బెదిరించాడు. ఏం చెయ్యాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. తన ఫుటేజ్ ఇచ్చేయమని అడిగింది. ఆమెను బాగా భయపెట్టి... రేప్ చేశాడు. ఇలా ఒకసారి కాదు... చాలాసార్లు చేశాడు. రేప్ చేసిన ప్రతిసారీ సీక్రెట్ వీడియో తీశాడు. మళ్లీ మళ్లీ అదే బ్లాక్ మెయిల్.

సహనం చచ్చిపోవడంతో ఆ యువతి బిబ్వేవాడీ పోలీసుల్ని ఆశ్రయించింది. కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ప్రకారం... 2018 మార్చి 20న ఆమె తొలిసారి క్లినిక్‌కి వెళ్లినట్లు చెప్పింది. మార్చి 25, 2020లో బాధితురాలికి అనారోగ్యం వచ్చింది. ఆమె తల్లి... ఆ ఆయుర్వేద డాక్టర్ దగ్గరకు వెళ్దాం పద అని ఆమెను బలవంతంగా తీసుకెళ్లబోయింది. తల్లికి నిజం ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. చివరకు ఓ బంధువుకు అసలు విషయం చెప్పింది. ఆ బంధువు ద్వారా... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆ డాక్టర్... క్లినిక్‌లో ఏదో మూలికల్ని చితక్కొడుతుండగా... పదరా... నిన్ను మేం చితక్కొడతాం... అంటూ లాక్కుపోయారు. క్లినిక్ మొత్తం తనిఖీలు చేసి... మొత్తం ఫుటేజ్ డిలీట్ చేశారు. అంతే కాదు... కోర్టు నిందితుడుకు 10 రోజుల పోలీస్ కస్టడీ ఇచ్చింది. ఇంకా ఎంత మందిని ఇలా చేస్తున్నాడో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.
Published by: Krishna Kumar N
First published: August 12, 2020, 1:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading