కల్లు విక్రయిస్తున్నారన్న సమాచారం ఇచ్చినందుకు వాలంటీర్‌పై దాడి..

నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలం నిడిగుర్తిం పంచాయతీలోని శ్రీపురం గ్రామంలో ఇటీవల కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే గ్రామ వాలంటీరు శ్రావణి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

news18-telugu
Updated: April 23, 2020, 7:32 PM IST
కల్లు విక్రయిస్తున్నారన్న సమాచారం ఇచ్చినందుకు వాలంటీర్‌పై దాడి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా నిషేధించిన కల్లు విక్రయాలు జరుపుతున్నారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామ వాలంటీర్‌పై దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలం నిడిగుర్తిం పంచాయతీలోని శ్రీపురం గ్రామంలో ఇటీవల కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే గ్రామ వాలంటీరు శ్రావణి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గీత కార్మికులను హెచ్చరించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారనే నెపంతో కొందరు గీత కార్మికులు ఇంకొందరు ఆకతాయిలతో గ్రామ వాలంటీరు శ్రావణి నివాసానికి వెళ్లి ఆమెను దుర్భాషలాడారు. ఆమె భర్తపై దౌర్జన్యం చేసినట్టు చెబుతున్నారు. విధుల్లో భాగంగానే కల్లు విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపారు. కావాలనే పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ఆమెతో పాటు తన భర్తపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Published by: Narsimha Badhini
First published: April 23, 2020, 7:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading