హోమ్ /వార్తలు /క్రైమ్ /

Youngest Serial Killer: సొంత చెల్లి, మరదలు అనేది చూడలేదు.. నివేదికలో సంచలన విషయాలు..

Youngest Serial Killer: సొంత చెల్లి, మరదలు అనేది చూడలేదు.. నివేదికలో సంచలన విషయాలు..

Youngest Serial Killer: సొంత చెల్లి, మరదలు అనేది చూడలేదు.. నివేదికలో సంచలన విషయాలు..

Youngest Serial Killer: సొంత చెల్లి, మరదలు అనేది చూడలేదు.. నివేదికలో సంచలన విషయాలు..

ప్రపంచ వ్యాప్తంగా సీరియల్‌ కిల్లర్స్‌ చేస్తున్న హత్యల గురించి వార్తల్లో చదివే ఉంటారు. కానీ అతి తక్కువ వయసున్న సీరియల్‌ కిల్లర్‌(Serial Killer) ఇండియాలో ఉన్నాడంటే నమ్ముతారా? అవును నివేదికలు ఏం చెబుతున్నాయంటే..

  • Trending Desk
  • Last Updated :
  • Bihar, India

ప్రపంచ వ్యాప్తంగా సీరియల్‌ కిల్లర్స్‌(Killers) చేస్తున్న హత్యల గురించి వార్తల్లో చదివే ఉంటారు. కానీ అతి తక్కువ వయసున్న సీరియల్‌ కిల్లర్‌(Serial Killer) ఇండియాలో ఉన్నాడంటే నమ్ముతారా? అవును నివేదికలు తెలుపుతున్న వివరాల మేరకు.. బీహార్‌లో(Bihar) ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన 8 ఏళ్ల బాలుడు మూడు హత్యలు చేశాడు. బీహార్‌లోని ముసాహర్‌ గ్రామానికి చెందిన ఈ బాలుడి పేరు అమర్జీత్ సదా(Amarjeet Sada). అంత చిన్న వయసులో అలా ఎందుకు మారాడు.. అందుకు గల కారణాలపై నివేదికలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

ముగ్గురి హత్య..

అమర్జీత్ సదా బీహార్‌లోని ముషాహర్ గ్రామంలో 1998లో జన్మించాడు. డైలీ మిర్రర్‌ తెలిపిన వివరాల మేరకు.. ముషాహర్ గ్రామంలో అమర్జీత్ సదా 2006, 2007 మధ్య వేర్వేరు ఘటనల్లో ఎనిమిదేళ్ల వయసులో కుటుంబ సభ్యులైన వారి సహా మొత్తం ముగ్గురిని హత్య చేశాడు. 2006లో సదా తన మేనమామ కూతురైన ఆరేళ్ల బాలికను చంపాడు. అతను ఎనిమిది నెలల వయస్సు ఉన్న తన సొంత చెల్లెల్ని కూడా హత్య చేశాడని భావిస్తున్నారు. సదా మూడో హత్యలో ప్రాణాలు కోల్పోయింది ఆరు నెలల పాప కావడం గమనార్హం. పక్కింట్లో ఉంటున్న దంపతుల ఆరు నెలల కుమార్తెను ఖుష్బూను సదా చంపాడని నివేదికలు చెబుతున్నాయి. 2016లో సదా విడుదలైనప్పటి నుంచి అతని ఆచూకీ తెలియరాలేదు.

PhD After Graduation: యూజీసీ కొత్త నిబంధనలు.. 4 ఏళ్ల డిగ్రీ తర్వాత నేరుగా పీహెచ్‌డీలో అడ్మిషన్ ..

సదా శాడిస్ట్‌ అన్న సైకాలజిస్ట్‌

పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు.. సదా నవ్వుతూ.. తన సోదరిని, అంతకు ముందు సంవత్సరం తన బంధువును హత్య చేసినట్లు అంగీకరించాడని, బాలుడి ముఖ్యంలో, మాటల్లో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని నివేదికలు వివరిస్తున్నాయి. డైలీ మిర్రర్ ది సన్ స్టోరీని ప్రస్తావిస్తూ.. పోలీసులు సదాను అదుపులోకి తీసుకున్న సమయంలో.. ఓ సైకాలజిస్ట్‌ సదాను శాడిస్ట్‌గా పేర్కొన్నాడని తెలిపింది. ఇతరులను గాయపరిచి ఆనందించే మనస్తత్వమని సైకాలజిస్ట్‌ చెప్పినట్లు పేర్కొంది.

యూఎస్‌లో అతి తక్కువ వయసున్న సీరియల్‌ కిల్లర్‌ క్రెయిగ్ ప్రైస్

ప్రపంచవ్యాప్తంగా తక్కువ వయసులో హత్యలు చేసిన వారిలో ఎసెక్స్‌కు చెందిన జేమ్స్ ఫెయిర్‌వెదర్ కూడా ఉన్నాడు. ఇద్దరి ప్రాణాలు తీసినప్పుడు అతని వయసు కేవలం 15 సంవత్సరాలు. మరో వ్యక్తిని హత్య చేసేందుకు ప్లాన్‌ చేస్తున్న సమయంలో జేమ్స్ ఫెయిర్‌వెదర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Yanam: యానాంలో మితిమీరిపోతున్న గంజాయి అమ్మకాలు..! కారణం ఇదే..?

అమెరికాలో సీరియల్ కిల్లర్ హార్వే మిగ్యుల్ రాబిన్సన్(47), పెన్సిల్వేనియాలో 17 సంవత్సరాల వయస్సులో ముగ్గురు బాధితులపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. అతను 1990ల నుంచి మరణశిక్ష అనుభవిస్తున్నాడు.

యూఎస్‌ చరిత్రలో అతి తక్కువ వయసున్న సీరియల్ కిల్లర్‌ క్రెయిగ్ ప్రైస్. అతను 13 ఏళ్ల వయసులో రెబెక్కా స్పెన్సర్ అనే 27 ఏళ్ల యువకుడిని 58 సార్లు కత్తితో పొడిచి చంపాడు. 15 సంవత్సరాల వయస్సులో క్రెయిగ్ ప్రైస్ మరో ఇద్దరిని కూడా హత్య చేశాడు.

Published by:Veera Babu
First published:

Tags: Bihar, Crime, Crime news

ఉత్తమ కథలు