ధోనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు.. మిస్టర్ కూల్‌కు షాక్..

MS Dhoni : క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆమ్రపాలి స్కామ్‌లో భాగంగా బాధితులు.. మిస్టర్ కూల్‌పై కేసు పెట్టారు.

news18-telugu
Updated: December 2, 2019, 3:10 PM IST
ధోనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు.. మిస్టర్ కూల్‌కు షాక్..
మహేంద్ర సింగ్ ధోనీ
  • Share this:
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆమ్రపాలి స్కామ్‌లో భాగంగా బాధితులు.. మిస్టర్ కూల్‌పై కేసు పెట్టారు. దానికి అంబాసిడర్‌గా ధోని పనిచేశాడని, ఆయనపై నమ్మకంతోనే తాము ప్లాట్లు కొనుగోలు చేశామని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్కాంలో ధోనికి కూడా భాగం ఉందని తెలిపారు. కాగా, ఆమ్రపాలి గ్రూప్ సకాలంలో ఇళ్లను నిర్మించి ఇవ్వడంలో విఫలం కావడంతో సుమారు 46000 మంది హోమ్ బయ్యర్స్ ఇప్పటికే సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. కంపెనీ డైరక్టర్లు, అలాగే ఆమ్రపాలీ గ్రూపునకు చెందిన ఇతర అనుబంధ సంస్థలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.ఇప్పటికే కంపెనీకి చెందిన సీఎండీ అనిల్ శర్మ, కంపెనీ డైరక్టర్లు శివ ప్రియ, అజయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.

అటు ధోని కూడా తనకు రావాల్సిన రూ.40కోట్ల బాకీని అమ్రపాలీ గ్రూప్ ఎగ్గొట్టిందని సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2009 నుంచి 2016 వరకూ ఆమ్రపాలి గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించానని, అయితే అందుకు పారితోషికంగా తనకు రావాల్సిన రూ.40కోట్లు ఇవ్వాల్సి ఉందని పలు దఫాలుగా అడుగుతూనే ఉన్నా కంపెనీ మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం చేస్తోందని కోర్టుకు తెలిపాడు.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...