America Drone Attack: ఉగ్రవాదంపై మరోసారి అమెరికా పంజా.. సిరియాలో అల్​ఖైదా సీనియర్​ నాయకుడిని మట్టుబెట్టిన అగ్రరాజ్యం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా (America) బలగాలు ఉగ్రవాదం (terrorism) పై పంజా విసిరాయి. అమెరికా డ్రోన్‌ దాడి (Drone attack)లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదా (al-Qaida) సీనియర్‌ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి.

  • Share this:
    అమెరికా (America) బలగాలు ఉగ్రవాదం (terrorism) పై పంజా విసిరాయి. అమెరికా డ్రోన్‌ దాడి (Drone attack)లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదా (al-Qaida) సీనియర్‌ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి. అమెరికా దళాలు సిరియా (Syria)లో జరిపిన డ్రోన్‌ దాడుల్లో అల్‌ఖైదా  (al-Qaida) సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్‌ (Abdul Hamid al-Matar) హతమయ్యాడని అమెరికా ఆర్మీ మేజర్‌ జాన్ రిగ్స్‌బీ (Army Major John Rigsbee)వెల్లడించారు. కాగా, దక్షిణ సిరియా (south Syria)లోని అమెరికా ఔట్‌పోస్ట్‌ (America outpost)పై ఉగ్రవాదులు దాడి జరిపిన రెండు రోజుల్లోనే ఈ డ్రోన్‌ దాడి జరగడం గమనార్హం.

    దాడులు కొంతమేర తగ్గే అవకాశం..

    ఆర్మీ మేజర్‌ జాన్ రిగ్స్‌బీ మాట్లాడుతూ.. అమెరికా పౌరులు (America citizens), తమ భాగస్వామ్య దేశాలు, అమాయక పౌరులపై ఉగ్రవాద సంస్థ జరిపే దాడులు కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ అల్‌-ఖైదా సీనియర్‌ నాయకుడిని హతమార్చడం ద్వారా ఉగ్ర సంస్థలు (terrorists group) మరింతగా కుట్ర పన్నేందుకు, ప్రపంచ దాడులకు పాల్పడే సామర్థ్యం దెబ్బతింటుందని అన్నారు.

    అమెరికా ఔట్‌పోస్ట్‌పై దాడి జరిపిన 2 రోజుల్లోనే..

    అమెరికా ఔట్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి జరిపిన రెండు రోజుల్లోనే ఈ డ్రోన్‌ దాడి (Drone strike) జరగడంతో ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందా? లేదా అనే విషయాన్ని అగ్రరాజ్యం ప్రకటించలేదు. కాగా, సెప్టెంబర్‌ చివరిలో పెంటగాన్‌ (pentagon) వాయువ్య ప్రాంతంలో ఇడ్లిబ్‌ సమీపంలో వైమానిక దాడిలో సిరియాలోని మరొక సీనియర్‌ అల్‌-ఖైదా కమాండర్‌ సలీం అబూ-అహ్మద్‌ను హతమార్చింది.

    కాబూల్​లోనూ డ్రోన్​ దాడే..

    కాబూల్ విమానాశ్రయం(Kabul Airport) వెలుపల ఈ ఆగస్టు చివరలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతి దాడులు, పేలుళ్లలో దాదాపు 180 మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఎక్కువగా అఫ్గాన్ పౌరులే ఉన్నారు. 169 మంది అఫ్గాన్ పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించారు. అయితే భీకర దాడులు చేసింది తామేనని ఐసీస్​-కే (ISIS-K) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే దాడికి అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడులకు ప్రణాళిక రచించిన ఐసిస్-కే కీలక సభ్యుడిని లక్ష్యంగా చేసుకుని అమెరికా డ్రోన్ దాడులకు (US Drone Strike) దిగింది. ఐసీస్-కే ఉగ్రసంస్థకు ప్రధాన కేంద్రంగా ఉన్న అఫ్గానిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్(Nangahar province)‌లో అమెరికా ఈ డ్రోన్ దాడి జరిపింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ (Capt Bill Urban) తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం తాము టార్గెట్‌ను అంతం చేశామని చెప్పారు. ఈ వైమానిక దాడి వల్ల సాధారణ పౌరులకు ప్రాణ నష్టం కలగలేదని అన్నారు
    Published by:Prabhakar Vaddi
    First published: