• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • AMBULANCE ATTENDANT SEXUALLY HARASSES SERIOUS COVID 19 PATIENT IN KERALA SU

మరీ ఇంతా నీచమా.. సీరియస్‌గా కరోనా సోకిన మహిళ ఆరోగ్య పరిస్థితి.. అంబులెన్స్‌లో లైంగిక వేధింపులు

మరీ ఇంతా నీచమా.. సీరియస్‌గా కరోనా సోకిన మహిళ ఆరోగ్య పరిస్థితి.. అంబులెన్స్‌లో లైంగిక వేధింపులు

ప్రతీకాత్మక చిత్రం

కరోనాతో బాధపడుతున్న మహిళ నిస్సహాయతను ఆసరాగా తీసుకోని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆమెపై లైంగిక వేధింపులకు గురిచేశాడు.

  • Share this:
    కరోనాతో బాధపడుతున్న మహిళ నిస్సహాయతను ఆసరాగా తీసుకోని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆమెపై లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో కోవిడ్‌తో బాధపడుతుందని కూడా చూడకుండా అంబులెన్స్ అటెండెంట్ ఈ విధంగా నీచమైన చర్యకు పాల్పడ్డాడు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఏప్రిల్ 27న జరిగిన ఈ ఘటన మే 13వ తేదీన వెలుగులోకి వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న బాధితురాలు వైద్యులకు జరిగిన దారుణం గురించి చెప్పడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని ప్రశాంత్‌గా గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.

    వివరాలు.. కరోనా సోకిన బాధిత మహిళ పెరింతలమన పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను ఏప్రిల్ 27న ఎంఆర్‌ఐ స్కానింగ్ కోసం అంబులెన్స్‌లో ల్యాబ్‌కు తరలించమని చెప్పారు. అయితే ఆమెను ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు తరలిస్తున్న సమయంలో అంబులెన్స్ అటెండెంట్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా లైంగికంగా వేధించాడు.

    అయితే అప్పుడు బాధిత మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఈ దారుణం గురించి ఆమె ఎవరికి చెప్పలేకపోయింది. ఇక, కొద్దిగా కోలుకున్నాక తర్వాత ఆ రోజు జరిగిన ఘటన గురించి వైద్యులకు తెలిపింది. దీంతో వైద్యులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
    Published by:Sumanth Kanukula
    First published: