వావ్ అలెక్సా.. ఈ స్టోరీ చదివితే మీరూ అదే మాట అంటారు..

యువతి తనను మోసం చేస్తుందని భావించాడు. ఆమెను చావబాదాడు.

news18-telugu
Updated: July 13, 2019, 3:09 PM IST
వావ్ అలెక్సా.. ఈ స్టోరీ చదివితే మీరూ అదే మాట అంటారు..
image: Amazon
news18-telugu
Updated: July 13, 2019, 3:09 PM IST
అలెక్సా... ఇవాళ న్యూస్ ఏంటి?, అలెక్సా.. మ్యూజిక్ కావాలి.. అని అడగితే వాటిని మనకు అందించే టెక్నాలజీ ఇప్పుడు ఏకంగా ఓ యువతి ప్రాణాలు కాపాడింది. మెక్సికోలో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు.. తన గర్ల్ ఫ్రెండ్‌ ఫోన్‌లో మరో వ్యక్తితో మాట్లాడడాన్ని గమనించాడు. దీంతో ఆ యువతి తనను మోసం చేస్తుందని భావించాడు. ఆమెను చావబాదాడు. బాయ్ ఫ్రెండ్ కొడుతుంటే.. ఆమె గట్టిగా ఏడుస్తూ ఉండిపోయింది. అయితే, ఆమె గొంతులో ఉన్న ధ్వనిని గుర్తించిన అలెక్సా.. ఏకంగా పోలీసులకు ఆటోమేటిక్‌గా ఫోన్ చేసింది. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆమె ఇంటికి వచ్చారు. గాళ్ ఫ్రెండ్‌ను కొట్టిన బాయ్ ఫ్రెండ్‌ కూడా అక్కడే ఉన్నాడు. ఆమె పరిస్థితి చూసిన పోలీసులకు విషయం అర్థమైంది. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...