దొంగతనానికి వెళ్లి.. ఏసీ చల్లదనానికి టెంప్ట్ అయ్యాడు..

క్లాస్ రూమ్‌ల్లో, సమావేశాల్లో పాల్గొన్నప్పుడు, సినిమా థియేటర్లలో, ఆఫీసుల్లో.. కునుకు తీయడం కొద్ది మందికి అలవాటు. అయితే ఇలా చేయడం వల్ల జరిగే పెద్ద నష్టమేమి లేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం దొంగతనానికి వెళ్లి.. గురకపెట్టి నిద్రపోయాడు.

news18-telugu
Updated: September 19, 2020, 7:10 PM IST
దొంగతనానికి వెళ్లి.. ఏసీ చల్లదనానికి టెంప్ట్ అయ్యాడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
క్లాస్ రూమ్‌ల్లో, సమావేశాల్లో పాల్గొన్నప్పుడు, సినిమా థియేటర్లలో, ఆఫీసుల్లో.. కునుకు తీయడం కొద్ది మందికి అలవాటు. అయితే ఇలా చేయడం వల్ల జరిగే పెద్ద నష్టమేమి లేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం దొంగతనానికి వెళ్లి.. గురకపెట్టి నిద్రపోయాడు.  తీరా అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో కొద్ది రోజుల కిందట చోటుచేసుకుంది. వివరాలు.. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బాబు అనే వ్యక్తి సత్తి వెంకటరెడ్డి అనే పెట్రోల్ బంక్ ఓనర్ ఇంట్లో చోరీకి ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా వెంకట్‌రెడ్డి రోజు వారీ కార్యకలాపాలపై రెక్కీ నిర్వహించాడు.

సెప్టెంబర్ 12న తన పథకాన్ని అమలు చేశాడు. తెల్లవారుజామున 4 గంటలకు మంకీ క్యాప్ ధరించి వెంకట్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం వెంకట్‌రెడ్డి గదిలోకి వెళ్లాడు. అక్కడ డబ్బులు బయటనే ఉండటంతో దొంగ‌త‌నానికి వ‌చ్చిన అత‌ను వాటిని కాజేశాడు . చివ‌రిగా ఏసీ గ‌దిలో ఉన్న ప‌వ‌ర్ ఎన్ఏపీని తీసుకొని ఎస్కేప్ అవుదాం అనుకున్నాడు.  ఆ గదిలో చల్లగా ఉండటంతో కొద్దిసేపు.. నిద్ర తీద్దామని వెంకట్‌రెడ్డి మంచం కింద దూరాడు. కానీ అలానే పడుకుని ఉండిపోయాడు. కాసేపటి తర్వాత ఇది గమనించిన వెంకట్‌రెడ్డి.. బాబు ఉన్న గదికి బయటి నుంచి లాక్ వేసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో వెంకట్‌రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు బాబును అరెస్ట్ చేశారు.

అప్పటికే అలసిపోయి ఉండటం, ఏసీ గదిలో చల్లగా రావడంతో నిద్రలోకి జారుకున్నానని బాబు తమ విచారణలో చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. స్వీట్ షాపులో పనిచేసే బాబుకు అప్పులు ఉన్నాయని.. ఈ క్రమంలోనే దొంగతనానికి యత్నించాడని తెలిపారు.
Published by: Sumanth Kanukula
First published: September 19, 2020, 7:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading