అమరావతిలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

ఒక్కసారిగా వేగంగా వచ్చిన వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు... ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కూడా మృతిచెందాడు.

news18-telugu
Updated: February 15, 2020, 9:01 AM IST
అమరావతిలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమరావతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆగి ఉన్న లారీని టాటా ఏసీ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిలో రోడ్డు పక్కన లారీని నిలిపి డ్రైవర్, క్లీనర్ మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వేగంగా వచ్చిన వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు... ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కూడా మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాల్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు కృష్ణా ప్రకాశం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.

మరోవైపు నిన్న నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆ్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ పదేళ్ల అమ్మాయి మృతి చెందింది. శుక్రవారం నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు సమీపంలో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని నెల్లూరు, ఆత్మకూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంటే అందులో ఒక చిన్నారి ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు