భర్తను వదిలేసి ప్రేయసితో సహజీవనం.. ఆమె లెస్బియన్ అని తెలిసి..

Lesbian: ఆ యువతి పెళ్లికి ముందు నుంచే లెస్బియన్. ఆ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు హెచ్చరించి ఓ యువకుడితో వివాహం చేశారు. కానీ..

news18-telugu
Updated: June 25, 2019, 5:47 PM IST
భర్తను వదిలేసి ప్రేయసితో సహజీవనం.. ఆమె లెస్బియన్ అని తెలిసి..
ప్రతీకాత్మక చిత్రం (Photo: Priyam Malhotra)
  • Share this:
సరిగ్గా 23 రోజుల క్రితం కొత్తగా పెళ్లైన యువతి ఇంటి నుంచి పారిపోయింది.. ఎటు వెళ్లిందో తెలీక అన్ని చోట్లా వెతికించిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు రాష్ట్రమంతా గాలించి, వేరే రాష్ట్రంలో వెతకగా ఓ చోట మరో మహిళతో కనిపించింది. పూర్తిగా ఆరా తీయగా పోలీసులను షాక్‌కు గురిచేసే జవాబు ఇచ్చింది. తాను లెస్బియన్ అని, భర్తతో కాపురం చేయలేనని. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన యువతి పెళ్లికి ముందు నుంచే లెస్బియన్. ఆ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు గద్దించి ఓ యువకుడితో వివాహం చేశారు. పెళ్లైతే అంతా సర్దుకుంటుందని, ఆమె మామూలు స్థితికి వస్తుందని ఆశపడ్డారు. కానీ, అతడితో ఇమడలేని ఆ యువతి ఇంటి నుంచి పారిపోయింది. హరియాణాలోని మానేసర్‌లో ఓ ఇల్లు తీసుకొని తాను ఇష్టపడ్డ మరో యువతితో సహజీవనం చేయడం ప్రారంభించింది.

అయితే, భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆమెను వెతికి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎందుకు ఇంటి నుంచి పారిపోయావని జడ్జి ప్రశ్నించగా.. ఆమె తరఫున భర్త నిజం వెల్లడించాడు. ఆమె మరో యువతితో సహజీవనం చేస్తోందని, ఇలా ఇంటి నుంచి పారిపోతుందని తెలీదని చెప్పాడు. అప్పటి వరకు ఈ విషయం తెలియని భర్త తరఫు బంధువులు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. వాళ్లే కాదు ఈ విచిత్రకర సంఘటనతో కోర్టు ప్రాంగణమంతా విస్తుపోయింది. కాగా, కోర్టుకు వివరణ ఇచ్చిన యువతి మళ్లీ తాను సహ జీవనం చేస్తున్న యువతి వద్దకే మళ్లీ వెళ్లిపోయింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 25, 2019, 5:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading