Khammam: కామంతో రగిలిపోతూ అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఆంటీ ఇంటికి యువకుడు.. ఇంట్లోకెళ్లాక ఊహించని ఘటన..

ప్రతీకాత్మక చిత్రం

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మూలగూడెంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన నునావత్ సుశీల అనే 36 ఏళ్ల వయసున్న మహిళ ఓ కిరాణా దుకాణం నడుపుకుంటూ ఒంటరి జీవనం సాగిస్తోంది.

  • Share this:
    ఖమ్మం: కొందరు యువకుల్లో కామ వాంఛ రోజురోజుకూ పెరుగుతోంది. ఆ స్థితిలో వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. కోరిక తీర్చకపోతే చంపేందుకు కూడా సిద్ధపడుతున్నారు. అలాంటి ఘటనే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మూలగూడెంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన నునావత్ సుశీల అనే 36 ఏళ్ల వయసున్న మహిళ ఓ కిరాణా దుకాణం నడుపుకుంటూ ఒంటరి జీవనం సాగిస్తోంది. ఒంటరి మహిళ అంటే సమాజంలో చిన్నచూపు ఉన్నట్టుగానే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే యువకుడు కూడా ఆమెను తప్పుడు దృష్టితో చూడటం మొదలుపెట్టాడు. కావాలనే ఆమెను చూసేందుకు ఏదో ఒకటి కొంటూ దుకాణానికి వెళ్లేవాడు. ఒంటరిగా ఉంటున్న మహిళ కావడంతో విషయం బయటకు తెలియకుండా చేసి ఎలాగైనా తన కామవాంఛ తీర్చుకోవాలని వెంకటేశ్వర్లు భావించాడు. ఈ క్రమంలోనే.. జూన్ 24న రాత్రి సమయంలో ఆమె ఇంట్లోకి దూరాడు. ఈ సమయంలో ఒంటరిగా ఉంటున్న తన ఇంటికి ఎందుకొచ్చావని ఆమె వెంకటేశ్వర్లును నిలదీసింది. ఆమె అలా అనగానే.. వెంకటేశ్వర్లు తనలో ఉన్న కామాంధుడిని నిద్రలేపి సుశీలపై చేతులేశాడు.

    ఎవరికీ తెలియకుండా తాను చూసుకుంటానని.. ప్రస్తుతం తన కోరిక తీర్చాలని ఆమెను బలవంతం చేశాడు. ‘అర్థం చేసుకో ఆంటీ’ అంటూ సుశీల ఒంటిపై ఉన్న చీర కొంగును మెల్లిగా తీసేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లాలని, తాను అలాంటి దాన్ని కాదని సుశీల ఆ యువకుడిని మందలించింది. నీ గురించి మీ తల్లిదండ్రులకు, ఊళ్లో పెద్దలకు చెబుతానని హెచ్చరించింది. అయితే.. ఆమె బయట చెబితే ఎక్కడ తన పరువు పోతుందోనని భావించిన వెంకటేశ్వర్లు క్షణికావేశంతో సుశీల తలపై అందుబాటులో ఉన్న రాయితో కొట్టాడు. ఈ దాడిలో సుశీల తీవ్రంగా గాయపడింది.

    రక్తస్రావం ఎక్కువ కావడంతో కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన సుశీల మృతదేహాన్ని కనిపించకుండా మాయం చేయాలని వెంకటేశ్వర్లు భావించినప్పటికీ.. ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ఆమె మృతదేహాన్ని బాత్రూంలో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. సుశీల హత్య కేసును విచారించిన సందర్భంలో పోలీసులకు వెంకటేశ్వర్లు వ్యవహార శైలిపై అనుమానమొచ్చింది. దీంతో.. తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా ఆమె తన కోరిక తీర్చకపోవడం, ఆ విషయాన్ని ఊళ్లో చెబుతానని బెదిరించడంతో పరువు పోతుందనే ఉద్దేశంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
    Published by:Sambasiva Reddy
    First published: