Home /News /crime /

ALLEGATIONS ON YSRCP LEADERS OVER DRUGS MAFIA IN ANDHRA PRADESH AS TDP CRITICIZING GOVERNMENT FULL DETAILS HERE PRN GNT

AP Drugs Issue: డ్రగ్స్ మాఫియా వెనుక ఆ పార్టీ నేతల హస్తముందా..? ఆ ఆరోపణల్లో నిజమెంత..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో డ్రగ్స్ (Drugs Issue)పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. గుజరాత్ (Gujarath) లోని ముంద్రా పోర్టులో (Mundra Port) డ్రగ్స్ పట్టుబడటం.. వాటి డెలివరీ అడ్రస్ విజయవాడగా (Vijayawada) ఉండటంతో తీవ్రకలకలం రేగింది.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో డ్రగ్స్  (Drugs)పై రాజకీయ (AP Politics) దుమారం కొనసాగుతోంది. గుజరాత్ (Gujarat) లోని ముంద్రా పోర్టులో (Mundra Port) డ్రగ్స్ పట్టుబడటం.. వాటి డెలివరీ అడ్రస్ విజయవాడగా (Vijayawada) ఉండటంతో తీవ్రకలకలం రేగింది. ముఖ్యంగా ఈ విషయంలో ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. సీఎంతో పాటు ఎమ్మెల్యే, ముఖ్యనేతలపై ఆరోపణలు చేస్తున్నాయి. ఏపీకి రాజధాని లేకుండా చేసిన ముఖ్యమంత్రి దేశానికే ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చేసారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి మూలాలు మాత్రం ఏపీలోనే ఉంటున్నాయని, డ్రగ్స్ వలన ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సోషల్ మీడియాలో (Social Media) విమర్శించారు. విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందాకు వైసీపీ నేతల అండదండలు ఉన్నాయని కూడా ఆయన విమర్శించారు.

  ఇటీవలి కాలంలో గుజరాత్ లోని మంధ్రా పోర్టులో నార్కోటిక్ అధికారులు భారీ ఎత్తున డ్రగ్స్ సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్ లో దాదాపు72,000 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా.ఐతే టాల్కం పౌడర్ ముసుగులో ఈ డ్రగ్స్ విజయవాడలోని ఆశి ట్రేడింగ్ కంపెనీ అనే ఏక్స్ పోర్ట్ & ఇంపోర్ట్ కంపెనీ పేరు మీద రిజిష్టర్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రచ్చమొదలైదనే చెప్పాలి.

  ఇది చదవండి: డ్రగ్స్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు..  ఇప్పటికే విశాఖ మన్యం కేంద్రంగా గంజాయి సాగు అక్రమ రవాణా అధికార పార్టీ నేతల అండదండలతో యధేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణల నేపధ్యంలో ఇప్పుడు ఈ డ్రగ్స్ దందా రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. అధికార పార్టీ పెద్దల సహకారం లేకుండా ఇంత పెద్ద రాకెట్ నడపడం సాధ్యంకాదని, డ్రగ్స్ రవాణాలో వైసీపీ నాయకుల హస్తం ఉందని ఒకరిద్దరు శాసనసభ్యుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఐతే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశ్యంతో తెదేపా ఇలాంటి ఆరోపణలు చేస్తుందని కొట్టిపారేస్తున్నారేతప్ప లోతైన దర్యాప్తుకు మాత్రం ప్రభుత్వం ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడటంలేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

  ఇది చదవండి: ఏపీకి అలర్ట్... ఈ నెలలో మరో రెండు తుపాన్లు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు...


  ఇప్పటికే రాష్ట్రంలో గంజాయి,అక్రమ మధ్యం,ఖైనీ,గుట్కా వ్యాపారాలతో ప్రత్యక్ష సంభంధం కలిగిన కొందరు అధికార పార్టీ శాసనసభ్యుల పేర్లు ఉదహరిస్తూ ఇప్పుడు తాలాబన్లతో డ్రగ్స్ దందా కూడా మొదలు పెట్టారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అధికారపార్టీ నుండి సరైన వివరణ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఏది ఏమైనా యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

  ఇది చదవండి: నలుగురు భార్యలు.. ఐదుగురు పిల్లలు.. నిత్యపెళ్లికుడుకైన కానిస్టేబుల్..


  సీఎం స్పందన..
  ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఏపీకి డ్రగ్స్ తో సంబంధమే లేదని.. లేని విషయాన్ని ఉన్నట్లుగా చూపించేందుకు అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తప్పుడు ప్రచారం చేస్తోందిన్న సీఎం.., పోలీసు వ్యవస్థ ప్రతిష్టను, ప్రభుత్వంతోపాటు వ్యక్తుల ప్రతిష్టలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో డ్రగ్స్‌ వ్యవహారం నిజం కాదని తెలిసికూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయని.., ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Drugs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు