రెండేళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే షరతుతో బెయిల్ మంజూరు చేసిన కోర్టు

రెండేళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే షరతుతో న్యాయస్థానం ఓ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని తెలిపింది.

news18-telugu
Updated: November 6, 2020, 6:41 AM IST
రెండేళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే షరతుతో బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రెండేళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే షరతుతో న్యాయస్థానం ఓ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని తెలిపింది. వివరాలు.. సోషల్ మీడియాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు అఖిలానంద్ రావు అనే వ్యక్తిని ఈ ఏడాది మే 12వ తేదీన ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అప్పటి నుంచి అతడు జైలు జీవితం గడుపుతున్నాడు. తనకు బెయిల్ మంజూర్ చేయాల్సిందిగా నిందితుడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.

ఈ నేపథ్యంలో అఖిలానంద్ బెయిల్ పిటిషన్‌పై అలహాబాద్ న్యాయమూర్తి జస్టిస్ సిద్దార్థ్ విచారణ చేపట్టారు. నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అనంతరం జస్టిస్ సిద్దార్థ్ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. అతడు రెండేళ్ల వరకు గానీ, ఈ ట్రయల్ కోర్టులో తీర్పు వెలువడే వరకు గానీ అతడు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇక, సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందేందుకు అతడు తప్పుడు స్టేటస్‌ను పెట్టకున్నారనే ఆరోపణలు కూడా అఖిలానంద్‌పై ఉన్నాయి. అతని మొత్తంగా 11 కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే అవన్నీ కూడా తప్పుడు కేసులేనని అఖిలానంద్ లాయర్ చెబుతున్నారు.
Published by: Sumanth Kanukula
First published: November 6, 2020, 6:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading