హోమ్ /వార్తలు /క్రైమ్ /

Allahabad HC: హైకోర్టు సంచలన తీర్పు.. భర్తను వదిలేసి విడాకులివ్వకుండానే భార్య వేరొకరిని పెళ్లి చేసుకుంటే..

Allahabad HC: హైకోర్టు సంచలన తీర్పు.. భర్తను వదిలేసి విడాకులివ్వకుండానే భార్య వేరొకరిని పెళ్లి చేసుకుంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కన్నాక భర్తకు చెప్పాపెట్టకుండా ఓ భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తాజాగా తన బిడ్డ తనకు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. దీన్ని మొదటి భర్త వ్యతిరేకిస్తున్నాడు. కాన్పూర్ కు చెందిన రామ్ కుమార్ గుప్త, సంయోగిత అనే భార్యాభర్తల మధ్య కేసు ఇది.

ఇంకా చదవండి ...

’నా భార్య నా అనుమతి లేకుండా వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. అతడిని పెళ్లి చేసుకుంది. నాకు విడాకులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి నా బిడ్డను నాకు ఇవ్వమంటే నేను ఎలా ఇస్తా. వాళ్లింట్లో నా బిడ్డకు రక్షణ ఉండదు. అసలు నా బిడ్డను ఇవ్వమని అడిగే హక్కు ఆమె కోల్పోయింది.‘.. ఇదీ ఓ భర్త వాదన. ’నా భర్త నన్ను చాలా హింసించేవాడు. చిత్ర హింసలు పెట్టేవాడు. ఓ వైపు బిడ్డ ఆలనా పాలనా, మరో వైపు ఇంటి పనులు చేసుకుంటున్నా నన్ను రోజూ కొట్టేవాడు. మనిషిలా చూడలేదు. అందుకే ఆయన నుంచి వెళ్లిపోయా. నన్ను అర్థం చేసుకున్న వ్యక్తితో కలిసి జీవిస్తున్నా. మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నా బిడ్డను కూడా నాతో పాటు తీసుకుని పోవాలనుకుంటున్నా. నా చిన్నారిని నాకు అప్పగించండి న్యాయమూర్తిగారూ..‘.. ఇదీ ఓ భార్య వాదన.

భార్యాభర్తలిద్దరి వాదనలు చదివితే విషయం అర్థం అయ్యే ఉంటుంది. పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కన్నాక భర్తకు చెప్పాపెట్టకుండా ఓ భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తాజాగా తన బిడ్డ తనకు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. దీన్ని మొదటి భర్త వ్యతిరేకిస్తున్నాడు. కాన్పూర్ కు చెందిన రామ్ కుమార్ గుప్త, సంయోగిత అనే భార్యాభర్తల మధ్య కేసు ఇది. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా మంగళవారం న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు. భర్తకు చెప్పకుండా భార్య మరో వ్యక్తితో వెళ్లిపోతే, పిల్లల సంరక్షణ విషయంలో ఏం చేయాలన్నదానిపై న్యాయమూర్తి విస్పష్టమైన తీర్పునిచ్చారు.

’ఓ మహిళ తన భర్త నుంచి విడిపోయి, మరో వ్యక్తితో కలిసి ఉంటున్నా పిల్లలపై ఆమెకు పూర్తి హక్కులు ఉంటాయి. పిల్లల ఆలనాపాలనా చూడాల్సిన బాధ్యత తల్లికి కచ్చితంగా ఉంది. దీన్ని కాదనేందుకు తండ్రికి ఏమాత్రం అర్హత లేదు. చిన్నతనంలోనే తల్లి దూరమయిపోతే ఆ పిల్లల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. బాల్యంలో తల్లిప్రేమను దూరం చేయడం మంచిది కాదు. కాబట్టి ఆ బిడ్డను తల్లి తీసుకెళ్లవచ్చు. కాకపోతే ప్రతీ రెండు నెలల కు ఓ సారి తండ్రి వద్దకు బిడ్డను తీసుకెళ్లాలి. తండ్రయినా బిడ్డ వద్దకు రావచ్చు. ‘ అని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేసే మునీర్ తీర్పునిచ్చారు.

First published:

Tags: High Court, Husband kill wife, Illegal relationship, Marriage, National

ఉత్తమ కథలు