కథువా రేప్ ఘటనలో నేడు తీర్పు... ఉరిశిక్ష వేయాలంటున్న బాధితులు

బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. బాలికను దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.

news18-telugu
Updated: June 10, 2019, 8:02 AM IST
కథువా రేప్ ఘటనలో నేడు తీర్పు... ఉరిశిక్ష వేయాలంటున్న బాధితులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా జిల్లాలోని ఎనిమిదేళ్ల బాలిక అత్యాచార ఘటనపై ఇవాళ స్పెషల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. జూన్ 3తో ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయ్యింది. దీంతో 10 వ తేదీన అంటే ఇవాళ న్యాయస్థానం తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో బాధిత కుటుంబం నిందితులకు కఠిన శిక్ష పడుతుందని ఆశగా ఎదురుచూస్తుంది. వారితో పాటు యావత్ భారత దేశం కూడా నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరుకుంటుంది.

జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేశారు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. బాలికను దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఇదే క్రమంలో బాలిక ఆచూకీ కోసం ఓరోజు ఆమె తల్లిదండ్రులు ఆలయం గేటు వద్దకు రాగా.. వారిని లోపలికి రానివ్వలేదని పోలీసులు తెలిపారు. అక్కడి వాతావరణం అత్యంత చల్లగా ఉండటంతో బాలిక మృతదేహం మూడు రోజుల పాటు కుళ్లిపోకుండా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ సాంజీ రామ్ ప్రధాన సూత్రధారి అని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.22ఏళ్ల కొడుకు కూడా నిందితుడేనని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అత్యంత పాశవికమైన ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. తీర్పు వస్తున్న నేపథ్యంలో ఘటనకు పాల్పడిన నిందితులను ఏ మాత్రం వదలకూడదని ఉరి శిక్షే వారికి సరైన శిక్ష అని అందరు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నెటిజన్లంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>