ALIGARH DALIT GIRL DEATH ACCUSED LURED MINOR ON PRETEXT OF BUYING SAMOSA RAPED HER BEFORE MURDER VB
Minor Girl: సమోసా కొనిస్తానని నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లాడు.. కట్ చేస్తే.. వరి పొలంలో ఆ బాలిక నగ్నంగా..
ప్రతీకాత్మక చిత్రం
Minor Girl: ఇంటి వద్ద ఆడుకుంటున్న మైనర్ బాలిక వరి పొలంలో నగ్నంగా.. దుస్తులు లేకుండా శవమై కనిపించింది. వాళ్ల ఇంటి పక్కనే ఉన్న 24 ఏళ్ల వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన యూపీలోని అలీగఢ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, అత్యాచారాలు(Rape) ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు రాక్షసుల్లో మార్పు రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
తాజాగా జరిగిన ఘటనలో ఓ మైనర్ బాలికను అత్యంతదారుణంగా అత్యాచారం చేసి.. వరి పొలంలో నగ్నంగా పడేశాడు ఓ కామాంధుడు. సమోసా కొనిస్తానని చెప్పి.. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ నాలుగేండ్ల దళిత బాలికను ఎత్తుకెళ్లి ఇలాంటి ఘటనకు పాల్పడ్డాడు. ఈ అత్యాచార ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల ప్రకారం ఇలా ఉన్నాయి. యూపీలోని అలీఘడ్ లో గోండా ప్రాంతం వద్ద ఓ ఇంటివద్ద ఆడుకుంటూ నాలుగేండ్ల బాలిక కనిపించలేకుండా పోయింది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు.
అయినా ఆ బాలిక కనిపించలేదు. పొలం వద్దకు ఏమైనా వెళ్లిందా అని చూశారు. అక్కడ ఆమె దుస్తులు మరో చోట.. ఆమె శవం నగ్నంగా మరో చోట కనిపించింది. బాలికకు సమోసా కొనిస్తానని చెప్పిన పొరుగింటి వ్యక్తి(24) మద్యం మత్తులో బాధితురాలిని నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అరెస్ట్ చేస్తారనే భయంతో ఆధారాలు లేకుండా బాలికను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక దొరికినప్పుడు ఆమె నగ్నంగా ఉందని.. నేరం జరిగిన ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో ఆమె బట్టలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) శుభమ్ పటేల్ తెలిపారు. 24 ఏళ్ల వ్యక్తిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 302, 201 కింద మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 5 మరియు 6 కింద కేసు నమోదు చేశారు. నిందితులను జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నమోదు చేయాలని SSP ఆదేశించింది. బాలిక మృతదేహాన్ని వెలికితీసిన తరువాత, స్థానికులు మరియు మృతుని కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. నిరసనకారుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) లోని సంబంధిత సెక్షన్ల కింద 80 మందిని బుక్ చేశారు.నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు.
మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.