• Home
 • »
 • News
 • »
 • crime
 • »
 • ALERT ROBBERY IN JAMMU DELHI DURANTO EXPRESS ARMED MEN ROBBED PASSENGERS IN 2 AC COACHES SS

Alert: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ... రైలులో మీ ప్రయాణం ఎంతవరకు సేఫ్?

Alert: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ... రైలులో మీ ప్రయాణం ఎంతవరకు సేఫ్?

Robbery in Duranto Express | దోపిడీ జరిగింది దురంతో ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో కావడం మరింత కలవరపరుస్తోంది. ఏసీ కోచ్‌లో కూడా భద్రత లేదంటే ఇక స్లీపర్, జనరల్ కోచ్‌లల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 • Share this:
  ఎక్కడికైనా ట్రెయిన్‌లో వెళ్లడం సురక్షితమైనదిగా చెప్పుకుంటారు కానీ... రైలు ప్రయాణం అంత సేఫ్ ఏమీ కాదని చెప్పే ఘటన ఇది. దేశరాజధాని న్యూఢిల్లీ శివారులో జరిగిన ఘటన... రైళ్లల్లో ప్రయాణికుల భద్రతను ప్రశ్నిస్తోంది. జమ్మూ నుంచి ఢిల్లీకి వస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో అర్థరాత్రి దోపిడీ జరిగింది. మారణాయుధాలతో వచ్చిన దోపిడీ దొంగలు ఏకంగా ఏసీ కోచ్‌లోకి చొరబడ్డారు. ప్రయాణికులపై తీవ్రంగా దాడి చేశారు. పీకలపై కత్తులు పెట్టి డబ్బు, నగలు, మొబైల్‌ఫోన్లు లాక్కున్నారు. కొన్ని నిమిషాల పాటు రైలులో బీభత్సం సృష్టించారు.

  ఇది కూడా చదవండి: WHATSAPP BUG: వాట్సప్‌లో మీ మెసేజెస్ మాయం... ఎందుకో తెలుసా?

  ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం... 12266 నెంబర్ గల దురంతో ఎక్స్‌ప్రెస్ జమ్మూ నుంచి ఢిల్లీకి బయల్దేరింది. తెల్లవారుజామున 4.20 గంటలకు ఢిల్లీ చేరుకోవాలి. మరో 50 నిమిషాల్లో ఢిల్లీకి చేరుకుంటుందనగా 3.30 గంటలకు ఢిల్లీ శివారులో ట్రెయిన్ ఓ చోట ఆగిపోయింది. ట్రాక్ సిగ్నల్ సరిగ్గా లేక ట్రెయిన్ ఆగిపోయిందని అంతా అనుకున్నారు. ఇంతలో 7 నుంచి 10 మంది దుండగులు బీ3, బీ7 కోచ్‌లోకి చొరబడ్డారు. వాళ్ల దగ్గర పదునైన కత్తులున్నాయి. వాటితో ప్రయాణికుల్ని బెదిరించిన దొంగలు, పీకలపై కత్తులు పెట్టి దోపిడీకి తెగబడ్డారు. 10 నుంచి 15 నిమిషాల పాటు దోపిడీ దొంగల బీభత్సం కొనసాగింది. అంత జరుగుతున్నా సెక్యూరిటీ సిబ్బంది కానీ, రైల్వే సిబ్బంది కానీ అక్కడికి రాలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందినంత దోచుకొని దొంగలు పరారయ్యారు.

  ఇది కూడా చదవండి: Budget 2019: భారతీయులందరూ చెల్లించే పన్నులు ఇవే... మీకెన్ని తెలుసు?

  రైలులో దోపిడీ గురించి భద్రతా సిబ్బందికి చెప్పేందుకు ప్రయత్నించాం. కానీ 20 నిమిషాల వరకు రైల్వే సిబ్బంది లేదా టీటీ జాడ దొరకలేదు. అసలు అటెండెంట్ ఉండాల్సిన చోట లేడు. ఎక్కడో నిద్రపోయాడు. టీటీ జాడ కూడా లేదు. దీంతో ప్రయాణికులు డయల్ 100 నెంబర్‌కు కాల్ చేశాం. ఢిల్లీ పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకొని ప్రయాణికుల దగ్గర వివరాలు సేకరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డైనమిక్ ఫేర్ పాలసీ పేరుతో అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్న రైల్వే... అందుకు తగ్గ భద్రతా ఏర్పాట్లు చేయలేదు. అసలు రైలులో సెక్యూరిటీ సిబ్బందే లేరని అటెండెంట్ తమతో చెప్పారు. ఏదైనా దారుణం జరిగితే తప్ప రైల్వే తమకు భద్రత ఏర్పాటు చేయదా?
  ఓ ప్రయాణికుడి ఆవేదన


  ఈ దోపిడీ జరిగింది దురంతో ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో కావడం మరింత కలవరపరుస్తోంది. ఏసీ కోచ్‌లో కూడా భద్రత లేదంటే ఇక స్లీపర్, జనరల్ కోచ్‌లల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ కోచ్ అయినా సరే ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రైల్వేదే. కానీ ఈ దోపిడీ ఘటనతో రైల్వే నిర్లక్ష్యమేంటో అర్థం చేసుకోవచ్చు. మీరు సంక్రాంతి సెలవుల తర్వాత రైలులో మీ గమ్య స్థానాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్త.

  ఇవి కూడా చదవండి:

   

  WhatsApp Dictation: చెప్తే చాలు... వాట్సప్‌ మెసేజ్ టైప్ అయిపోతుంది

  Flipkart Republic Day Sale: జనవరి 20 నుంచి 22 వరకు ఫ్లిప్‌‌కార్ట్‌‌లో రిపబ్లిక్ డే సేల్

  Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్

  Donkey's Milk Soap: గాడిద పాల సబ్బుకు ఫుల్ డిమాండ్... ధర రూ.499

  Jio Effect: వొడాఫోన్ రూ.396 కొత్త ప్లాన్... 69 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్
  First published: