ఓ కొడుకు కిరాతకం.. కన్నతల్లి అన్న కనికరం లేకుండా..

కొడుకు ప్రశాంత్(25) చదువు సంధ్యా లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు.చెడు స్నేహాల కారణంగా మద్యానికి,గంజాయికి బానిసయ్యాడు. దీంతో మద్యానికి డబ్బులు ఇవ్వమని నిత్యం తల్లితో గొడవపడుతుండేవాడు.

news18-telugu
Updated: November 22, 2019, 8:13 AM IST
ఓ కొడుకు కిరాతకం.. కన్నతల్లి అన్న కనికరం లేకుండా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కన్నతల్లి అన్న కనీస కనికరం లేకుండా కిరాతకానికి పాల్పడ్డాడో కొడుకు. మత్తుకు బానిసై..మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంత తల్లి పైనే హత్యాయత్నం చేశాడు. కత్తితో కసితీరా ఆమెను పొడిచాడు. ఆపై 'చంపేశాను..' అని అరుస్తూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమురం భీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ కాలనీకి చెందిన సంధ్యారాణి అంగన్‌వాడీ ఆయాగా పనిచేస్తోంది. ఆమె భర్త ప్రభాకర్ పదేళ్ల క్రితమే చనిపోవడంతో కుటుంబాన్ని తానే పోషిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.ఇటీవలే కూతురుకు పెళ్లి చేసింది. కొడుకు ప్రశాంత్(25) చదువు సంధ్యా లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు.చెడు స్నేహాల కారణంగా మద్యానికి,గంజాయికి బానిసయ్యాడు. దీంతో మద్యానికి డబ్బులు ఇవ్వమని నిత్యం తల్లితో గొడవపడుతుండేవాడు.ఇదే క్రమంలో ఈ నెల 19న కూడా తల్లితో గొడవపడ్డాడు. తల్లికి వితంతు ఫించన్ రావడంతో ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. నిద్రిస్తున్న సమయంలో కత్తితో ఆమె గొంతు కోశాడు.అనంతరం ఆమె ఛాతీ,ఉదర భాగాల్లో పొడిచి పారిపోయాడు. బాధితురాలి అరుపులకు చుట్టుపక్కల జనం ఆమె ఇంటికి పరుగెత్తుకొచ్చారు. వారిని చూసిన ప్రశాంత్.. 'చంపేశాను.. వెళ్లి చూసుకోండి..' అంటూ గట్టి గట్టిగా అరుస్తూ పారిపోయాడు. స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.
Published by: Srinivas Mittapalli
First published: November 22, 2019, 8:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading