Home /News /crime /

AIRTEL WARNS ABOUT KYC FRAUDS AFTER CUSTOMER GETS DUPED BY FRAUDSTER CLAIMING TO BE AIRTEL EXECUTIVE GH VB

Airtel KYC Fraud: ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ ముసుగులో మోసం.. ఆ కేటుగాళ్లు ఏం చేస్తారో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Airtel KYC Fraud: కేవైసీ(KYC) ఫారమ్‌ను అప్‌డేట్ చేసే సాకుతో ఒక ఎయిర్‌టెల్ కస్టమర్‌ను బురిడీ కొట్టించారు మోసగాళ్లు. సదరు కస్టమర్ బ్యాంక్ వివరాలు సేకరించి అతడి అకౌంట్ నుంచి భారీ నగదును తస్కరించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ కేవైసీ, ఓటీపీ మోసాల గురించి తన కస్టమర్‌లను మళ్లీ హెచ్చరించింది.

ఇంకా చదవండి ...
సైబర్ నేరగాళ్లు (Cyber) సామాన్య ప్రజలకు టోకరా వేసేందుకు జిత్తులమారి ట్రిక్కులు (Tricks) ప్రయోగిస్తున్నారు. ప్రముఖ కంపెనీల అధికారుల్లా మాట్లాడుతూ కేవైసీ, ఓటీపీ పేరుతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఈ మోసాల గురించి ఇప్పటికే పలు సంస్థలు జనాలను హెచ్చరించాయి. కానీ ఇప్పటికీ ఈ కేటుగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్న వారందరో! తాజాగా కేవైసీ(KYC) ఫారమ్‌ను అప్‌డేట్ చేసే సాకుతో ఒక ఎయిర్‌టెల్ కస్టమర్‌ను బురిడీ కొట్టించారు మోసగాళ్లు. సదరు కస్టమర్ బ్యాంక్ వివరాలు సేకరించి అతడి అకౌంట్ నుంచి భారీ నగదును తస్కరించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ కేవైసీ, ఓటీపీ మోసాల గురించి తన కస్టమర్‌ (Customer) లను మళ్లీ హెచ్చరించింది.

Girl Alone: ఇంట్లో ఒంటరిగా బాలిక.. పక్కింట్లో అదే సమయం కోసం వేచి చూసిన యువకుడు.. చివరకు బాలిక ఇంట్లోకి వెళ్లి..


మోసగాళ్లు ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌ల ముసుగులో యూజర్ల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ తరహా కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. “బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి కాల్ చేస్తున్నట్లు లేదా మెసేజ్‌లు పంపిస్తున్నట్లు మోసగాళ్లు కస్టమర్లను సంప్రదించవచ్చు. తరువాత ఇప్పటికే ఉన్న బ్యాంక్ ఖాతాను అన్‌బ్లాక్ లేదా రెన్యువల్ చేస్తామని కస్టమర్ల ఖాతా వివరాలు లేదా ఓటీపీని అడగవచ్చు. కస్టమర్లు ఇచ్చే వివరాలు ఈ మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్ ఐడీ, ఎంపిన్(MPIN), ఓటీపీ మొదలైన ఆర్థిక లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో పంచుకోవద్దని మిమ్మల్ని కోరుతున్నాం" అని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ హెచ్చరించారు.

Crime News: ఈ మహిళ పోరాడి అనుకున్నది సాధించింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌లుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు చేసే కాల్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను విట్టల్ కోరారు. ఫేక్ యూపీఐ వెబ్‌సైట్‌లు, ఫేక్ ఓటీపీల కారణంగా తరచూ జరిగే మోసాల గురించి కూడా అతను వివరించారు. మోసగాళ్ల బాధితులు అవ్వకుండా ప్రతి కస్టమర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన పేర్కొన్నారు.

“ఒక కస్టమర్ మోసపూరితమైన యూపీఐ అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేసినా.. లేదా ఫేక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లినా అతడి బ్యాంకు వివరాలు ఇతరుల చేతిలో పడే ప్రమాదం ఉంది. ఈ తరహా వెబ్‌సైట్లలోకి వెళ్లగానే అవి అన్ని బ్యాంక్ వివరాలను, ఎంపిన్ నమోదు చేయమని అడుగుతాయి. ఒకవేళ ఆ వివరాలను వెల్లడిస్తే మోసగాడు మీ బ్యాంక్ వివరాలను పూర్తిగా యాక్సెస్ చేస్తాడు. తద్వారా మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే దయచేసి అలాంటి అనుమానాస్పద వెబ్‌సైట్‌లు, యాప్‌లకు వీలైనంత దూరంగా ఉండండి. ఈమెయిల్ ద్వారా లేదా ఈమెయిల్‌లోని అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయకండి. మీ బ్యాంకు వివరాలను ఎవరితో షేర్ చేయకండి. ఆదాయపు పన్ను శాఖ, వీసా, మాస్టర్‌కార్డ్ వంటి అధికారుల నుంచి వచ్చినట్లు ఈమెయిల్ కనిపించినా వాటిని ఓపెన్ చేయకండి" అని విట్టల్ సూచించారు.

ఓ ఆటోలో ముగ్గురు తాగుబోతులు.. నిర్మాణుష్య ప్రాంతం.. కల్లు తాగిన వివాహిత.. చివరకు ఏం జరిగిందంటే..


టెలికాం యూజర్లకు తరచుగా కేవైసీ వెరిఫికేషన్ పేరుతో ఫేక్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. కేవైసీ వెరిఫై చేయకపోతే యూజర్లు 24 గంటల్లో తమ నంబర్‌కు యాక్సెస్ కోల్పోతారని నకిలీ మెసేజ్‌లు వస్తున్నాయి. ఐతే యూజర్లు స్కామ్ మెసేజ్‌లు సులభంగా గుర్తించవచ్చు. ఎందుకంటే ఆ స్కామ్ మెసేజ్‌ల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. "మీ ఈకేవైసీ వివరాలు/ఆధార్ నంబర్‌ను షేర్ చేయమని, ఏదైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేయమని ఎయిర్‌టెల్ మిమల్ని ఎప్పుడూ అడగదు" అని ఇప్పటికే కంపెనీ తన కస్టమర్లను హెచ్చరించింది.
Published by:Veera Babu
First published:

Tags: AIRTEL, Fraud

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు