Airtel KYC Alert: ఎయిర్ టెల్ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ లింకులు ఓపెన్ చేశారో.. అంతే..

ప్రతీకాత్మక చిత్రం

Airtel KYC Alert: ఎయిర్ టెల్ కెవైసి పేరు మీద మోసగాళ్లు రెచ్చిపోతున్నారని.. దాన్ని నమ్మకూడదని పోలీసులు హెచ్చరించారు. మోసగాళ్ల మాటలు నమ్మితే అది మీ బ్యాంకు వివరాలను వారికి ఇచ్చినట్టే అని సూచించారు.

  • News18
  • Last Updated :
  • Share this:
    Airtel KYC Alert: సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఎంతగా చర్యలు చేపడుతున్నా.. నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. అమాయక వినియోగదారులే లక్ష్యంగా వారిని నిండా ముంచుతున్నారు. తాజాగా ఎయిర్ టెల్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని.. వారిని కెవైసి (KYC) అప్డేట్ చేయాలని సందేశాలు పంపుతూ వారిని బురిడీ కొట్టిస్తున్నారు. కెవైసి అప్డేట్ చేయించుకోకుంటే మీ మొబైల్ సేవలు నిలిపివేయబడతాయని హెచ్చరించడంతో గాబరా పడుతున్న వినియోగదారులు దానిని అప్డేట్ చేయడానికి లింక్ ను క్లిక్ చేసి మోసపోతున్నారు.

    ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక ట్వీట్ చేశారు. ఎయిర్ టెల్ కెవైసి పేరు మీద మోసగాళ్లు రెచ్చిపోతున్నారని.. దాన్ని నమ్మకూడదని హెచ్చరించారు. మోసగాళ్ల మాటలు నమ్మితే అది మీ బ్యాంకు వివరాలను వారికి ఇచ్చినట్టే అని సూచించారు.





    ట్వీట్ లో.. ‘ఎయిర్ టెల్ వినియోగదారులు కెవైసి అప్డేట్ చేయాలని పలువురు మోసగాళ్లు ఫోన్లు, మోసేజ్ లు పెడుతున్నారు. ఇందుకోసం ఒక లింక్ ను ఇచ్చి దానిని క్లిక్ చేసి అందులో అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు. సదరు లింక్ ఓపెన్ చేయగానే అది సరాసరి బ్యాంకు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను అడుగుతుంది. ఆ తర్వాత రూ. 10 చెల్లిస్తే మీరు అంతరాయం లేకుండా సేవలు చేసుకోవాలని చెబుతుంది. కానీ దీని ద్వారా మోసగాళ్లు మీకు తెలియకుండానే మీ డబ్బులు దోచుకుంటున్నారు..’ అని హెచ్చరించారు.
    Published by:Srinivas Munigala
    First published: