శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం

విమానం దిగి ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్నఈ వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద భారీ ఎత్తున బంగారం లభించింది.

news18-telugu
Updated: October 20, 2019, 10:44 PM IST
శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 20, 2019, 10:44 PM IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని విదేశాల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు వ్యక్తులు జెడ్డా నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. విమానం దిగి ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్నఈ వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద భారీ ఎత్తున బంగారం లభించింది. వారిని తనిఖీ చేయగా ఒక్కొక్కరి దగ్గర 300 గ్రాముల చొప్పున బంగారం లభించిందన్నారు. దాదాపు ఒక కేజీ బంగారం దొరికింది. దీని విలువ రూ.35,50,858లక్షలు ఉంటుందన్నారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా దానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు చూపలేదు. దీంతో బంగారంను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిపారు.First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...