Home /News /crime /

AIR FORCE SERGEANT DEVENDRA KUMAR SHARMA DELHI POLICE ARREST HONEY TRAPPED INDIAN AIRFORCE SERGEANT FOR LEAKING SENSITIVE INFO PAH

Honey trap: మరోసారి హనీ ట్రాప్ కలకలం.. భారత్ వైమానిక దళ అధికారి అరెస్టు..

నిందితుడు దేవేంద్ర (ఫైల్)

నిందితుడు దేవేంద్ర (ఫైల్)

Delhi: భారత్ లో హనీ ట్రాప్ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఎయిర్ ఫోర్స్ అధికారి వలపు వలలో చిక్కుకుని.. భారత్ ముఖ్యమైన రహస్యాలను లీక్ చేసినట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం కాలంలో సామాజిక మాధ్యమాలను (Social media) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొందరు ఈ మాధ్యమాల ద్వారా అవతలి వారిని వేధిస్తున్నారు. మరికొందరు సైబర్ నేరగాళ్లు.. అమ్మాయిలుగా మాట్లాడుతూ.. హనీ ట్రాప్ కు పాల్పడుతున్నారు. కొందరు బ్లాక్ మెయిలింగ్ కు దిగి అందిన కాడిని దోచుకుంటున్నారు. ఇంకొందరు అధికారులు.. ఈ ట్రాప్ లో చిక్కుకుని దేశ రహస్యాలను కూడా లీక్ చేసేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీకి (Delhi) చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారి (Air force officer)  హనీ ట్రాప్ లో (Honey trap) ఇరుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాశంగా మారంది.  భారత దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారి దేవేంద్ర శర్మ హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. నిందితుడు ఢిల్లీలోని సుబ్రోటో పార్క్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) రికార్డ్ ఆఫీస్‌లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (జిడి)గా పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. భారత దేశానికి చెందిన ముఖ్యమైన రహస్యాలను సోషల్ మీడియా ద్వారా లీక్ చేసినట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ (Delhi crime branch) పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈయన ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి అరెస్టు చేశారు.

దేవేంద్ర శర్మ.. (Devendra sharma) ఎయిర్ ఫోర్స్ కు చెందిన ముఖ్యమైన రహస్యాలను అవతలివారికి పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మే 6 న ఇతడిని అరెస్టు చేసినప్పటికి.. ఈ రోజు పోలీసులు అధికారికంగా అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. నిందితుడు ఎన్ని రోజుల నుంచి విషయాలను లీక్ చేస్తున్నాడు.. ఇప్పటి వరకు ఏయే విషయాలను చెప్పినట్లు పలు విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిందితుడి ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్ లను అధికారులు తమ స్వాధీనంలోనికి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Indian Air Force, Trapped

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు